Home సూర్యాపేట కొడుకు సహా చెరువులో దూకి తల్లి ఆత్మహత్య

కొడుకు సహా చెరువులో దూకి తల్లి ఆత్మహత్య

                 So Many Houses Drown in Medaram Lake

తిరుమలగిరి: చెరువు కుంటలో పడి తల్లీ కొడుకు మృతి చెందిన సంఘటన సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తొండ గ్రామంలో సోమవారం సాయంత్రం విషాదం నింపింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన వెల్పుల సోమయ్యకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా భర్త మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని తరుచూ భార్యను వేధిస్తున్నాడు. దీంతో మనస్తాపానికి గురైన భార్య ఉప్పమ్మ, పెద్ద కొడుకు శ్రావణ్‌ను నడుము కు కట్టుకొని తన వ్యవసాయ క్షేత్రం వద్ద బొంగురాల కుంటలో దూకి ఆత్మహ త్య చేసుకున్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.