Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

కుమారుడితో కలిసి తల్లి ఆత్మహత్య

Mother and Son Suicide Fell into Well in joguLamba Gadwal

జోగులాంబ గద్వాల్: క్షణికావేశంలో కుమారిడితో కలిసి తల్లి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆదివారం తెల్లవారు జామున ధరూరు మండల పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ మురళిగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం…. రాజోళి మండలానికి చెందిన మమత(23)కు ధరూరు మండలం ద్యాగదొడ్డి గ్రామానికి చెందిన బీశన్నతో ఐదేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి తొమ్మిది నెలల కుమారుడు వసంత్ ఉన్నాడు. అయితే మమత భర్త బీశన్న ఎండలు ఎక్కువగా ఉన్నాయి, పొలం పనులకు రావద్దంటూ మమతకు హెచ్చరించాడు.  పొలం పనుల విషయంలో ఇరువురికి కొంత వాదన జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన మమత తెల్లవారుజామున కుమారుడితో కలిసి గ్రామ సమీపంలో ఉన్న బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. అయితే భార్య, కుమారుడు కనిపించకపోవడంతో ఆందోళన చెందిన భర్త బీశన్న తన భార్య, కుమారుడి కోసం గాలింపు చేపట్టాడు. బావిలో దూకి మృతి చెందిన విషయాన్ని గుర్తించి మమత తల్లిదండ్రులకు తెలియజేశాడు. ఈవిషయం తెలిసిన ఎస్‌ఐ మురళిగౌడ్ సంఘటన స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. మమత మృతిపై వారి తల్లిదండ్రులు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని చెప్పారు.

Comments

comments