Home తాజా వార్తలు తల్లి, కొడుకులు అదృశ్యం

తల్లి, కొడుకులు అదృశ్యం

 Mother And  sons disappear in Rangareddy dist
శంకర్‌పల్లి :తల్లి కొడుకుల అదృశ్యమైన సంఘటన శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, బంధువులు తెలిపిన ప్రకారం.. శంకర్‌పల్లి మండలం ఎల్వర్తి గ్రామంలో గత 4 సంవత్సరాల నుంచి సప్న (35), కొడుకు సన్ని (7)తో కలిస నివాసముంటుంది. ఆమె కొన్ని సంవత్సరాల నుంచి మానసికంగా కుటుంబ కలహాలతో సతమతమవుతుంది. ఈ నెల 30వ తేదిన రాత్రి 7.30 గంటలకు తన కొడుకుతో కలిసి ఇంటి నుంచి ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్ళింది. ఎంత మేరకు తిరిగి రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు వాళ్ళిద్దరి కోసం స్నేహితులు, బంధువల వద్ద ఆచూకి కోసం గాలించిన లభించకపోవడంతో శంకర్‌పల్లి పోలీస్‌లను ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.