Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

మాతా,శిశు ఆరోగ్య కేంద్రం నిర్మాణ పనులకు శంకుస్థాపన

Mother, Child Health Center laid the  for construction work

ఎంపి కవిత, మంత్రి ఈటల

మనతెలంగాణ/జగిత్యాల: జిల్లా కేంద్రంలోని ధ రూర్ క్యాంపులో 10ఎకరాల స్థలంలో రూ.17 కోట్లతో చేపట్టనున్న మాతా, శిశు ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణ పనులకు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవితతో కలిసి రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ సోమవారం శంకుస్థాపన చేశారు. జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిని జిల్లా ప్ర ధాన ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేసిన ప్ర భుత్వం అక్కడ వసతి సౌకర్యాలు సరిపోవడం లేదని గుర్తించి రూ.17 కోట్లతో మాతా, శిశు ఆరోగ్య కేంద్రం నిర్మించేందుకు నిధులు మంజూరు చేసింది. టెండర్ ప్రక్రియ కూడా పూర్తి కావడంతో మంత్రి ని ర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంఎల్‌ఏ జీవన్‌రెడ్డి, జడ్‌పి చైర్‌పర్సన్ తుల ఉమ, ఎంఎల్‌సి నారదాసు లక్ష్మణ్‌రావు, రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ రాజేశంగౌడ్, మార్క్‌ఫెడ్ చైర్మన్ లోక బాపురెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ విజయలక్ష్మి, జిల్లా కలెక్టర్ శరత్, సబ్ కలెక్టర్ గౌతం పొట్రూ, జిల్లా ఇన్‌చార్జి వైద్యాధికారి డాక్టర్ జయపాల్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ సిరాజుద్దీన్ మన్సూర్, వైస్ ఎంపిపి గంగం మహేశ్, కౌన్సిలర్లు సరళాదేవి, పిప్పరి అనిత, తదితరులు పాల్గొన్నారు.

Comments

comments