Home జాతీయ వార్తలు పరీక్ష హాలులో ప్రసవించింది!

పరీక్ష హాలులో ప్రసవించింది!

Mother-Childగిరిధ్ : పరీక్ష రాయాలనే తపనతో నెలలు నిండినా పట్టంచుకోకుండా పరీక్ష హాలుకు వెళ్లిన ఓ గర్భిణి అక్కడే ప్రసవించి పండంటి బిడ్డకు జన్మనించ్చింది. ఈ ఘటన ఝార్ఖండ్‌లోని గిరిధ్ జిల్లాలో చోటు చేసుకుంది. ధనావర్‌లోని అదారా కళాశాలకు చెందిన భారతీ కుమారి బిఎ మూడో సంవత్సరం చదువుతుంది. తన ఇంటికి 25 కి.మీల దూరంలోని సరియా కళాశాలలో ఆమె పరీక్ష కేంద్రం ఉంది. బిర్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని జిట్‌కుండి గ్రామం నుంచి ఆమె గతుకుల రోడ్డుపై ఆటోలో పరీక్ష కేంద్రానికి వచ్చారు. పరీక్ష ప్రారంభమవుతుందన్న కొద్ది సేపట్లోనే భారతికి పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. దీంతో కళాశాల సిబ్బంది సమీపంలోని నర్సింగ్ హోంకు ఫోన్ చేశారు. వారు కళాశాలకు వచ్చే సరికే భారతి బిడ్డకు జన్మనిచ్చింది. తర్వాత తల్లీ బిడ్డల్ని ఆస్పత్రికి తరలించారు. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.