Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

కోడలిపై మామ అఘాయిత్యం : కాల్చి చంపేసిన అత్త

GUN

పెషావర్‌ : కోడలిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని కట్టుకున్న భర్తనే కడతేర్చింది ఓ మహిళ. మూడు నెలలుగా కోడలి తనతో అక్రమ సంబంధం పెట్టుకోవాలని వేధింస్తున్న మామ నిద్రిస్తున్న సమయంలో అత్త తుపాకీతో కాల్చ చంంపేసింది. పాకిస్థాన్‌లోని ఖైబర్‌ పక్తుంక్వా షంగ్ల గ్రామంలో ఈ ఘటన జరిగింది. గుల్బార్‌ ఖాన్‌ అనే వ్యక్తి కొడుకు లేని సమయం చూసి కోడలితో అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. తనతో అక్రమ సంబంధం పెట్టుకోవాలసి కోడలిని తరచూ వేధించేవాడు. ఈ విషయాన్ని ఆ మహిళ తన భర్తతో చెప్పుకొని వాపోయింది. కానీ తండ్రి అనే గౌరవంతో ఆయన్ని చంపకుండా వదిలేసి.. తల్లి బేగంతో జరుగుతున్న ఘోరం గురించి చెప్పాడు. అయితే వావి వరుస మర్చిపోయి , కుటుంబ గౌరవాన్ని మంట కలిపిన తన భర్తను చంపేయాలని బేగం నిర్ణయించుకుంది. అతను నిద్రిస్తున్న సమయంలో కోడలి సమక్షంలోనే తుపాకీతో కాల్చి చంపేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు బేగం బీబీ, కోడలిని అరెస్టు చేశారు.

Comments

comments