Home తాజా వార్తలు చెరువులోకి దూకి ముగ్గురి ఆత్మహత్య

చెరువులోకి దూకి ముగ్గురి ఆత్మహత్య

Couple Commits Suicide in Nellore District

 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా బుక్కపట్నంలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. కుటుంబకలహాలతో ఇద్దరు పిల్లల సహా తల్లి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని చెరువులోని మృతదేహాలను బయటకు తీశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు రమాదేవి(35), చింటూ(8), జస్మిత్(6)గా గుర్తించారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.