Search
Monday 24 September 2018
  • :
  • :

కన్నకూతురిపట్ల తల్లి అమానుషం…

Child-Marriage

సిరిసిల్ల: కన్నకూతురిపట్ల అమానుషంగా ప్రవర్తించిందో తల్లి. 16 ఏళ్ల వయసున్న కూతురిని 50 ఏళ్ల వ్యక్తికి ఇచ్చి వివాహం చేసేందుకు యత్నించింది. ఈ దారుణ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల టౌన్‌లో చోటుచేసుకుంది. స్థానిక సంజీవయ్యనగరలో ఉండే మాణెమ్మ భర్త చనిపోవడంతో కోనాయపల్లికి చెందిన గంగరాజుతో అక్రమ సంబంధం పెట్టుకుంది. గంగరాజు దుబాయ్‌లో పనిచేస్తున్నాడు. అయితే గంగరాజు కన్ను మాణెమ్మ కూతురుపై పడింది. దీంతో మాణెమ్మను గంగరాజు మాయమాటలు చెప్పి కుమార్తెను తనకిచ్చి పెళ్లి చేయాలని ఒప్పించాడు. ఈ క్రమంలో తన కూతురును గంగరాజుతో పెళ్లి చేయాలని నిర్ణయించుకున్న మాణెమ్మ హైదరాబాద్‌కు తీసుకెళ్తుండగా బాలిక కేకలు వేసింది. అది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు మాణెమ్మతో పాటు గంగరాజు, బాధితురాలి చిన్నమ్మలైన కళ, మాధవిలను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.

Mother Trying to marriage her 16 year old Daughter with 50 year Old Man.

Comments

comments