Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

రోడ్డు ప్రమాదంలో తల్లి కొడుకు మృతి 

Mother's son killed in road accident

నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని రోల్ మామడ గ్రామ సమీపంలోని నాలులైన్ల జాతీయ రహదారిపై బుధవారం మద్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లి, కొడుకు మృతి  చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బోథ్ మండలంలోని కుచులాపూర్ గ్రామానికి చెందిన కారెం రమణయ్య తన కుమారుడికి ఆరోగ్యం బాగలేకపోవడంతో భార్య కారెం వనజ(25), కుమారుడు అక్షిత్(2)ను తీసుకొని నిర్మల్ ఆసుపత్రిలో వైద్య చికిత్సలు చేయించుకొని తిరుగు ప్రయాణం ద్విచక్రవాహనంపై వస్తున్నారు. మార్గమద్యలో రోల్‌మామడ వద్దకు రాగానే బారీ వర్షం రావడంతో ద్విచక్రవాహనాన్ని రోడ్డు పక్కన ఆపి తన భార్య, కుమారుడితో బస్సుకోసం వేచి చూస్తున్నారు. నిర్మల్ వైపు నుంచి అతి వేగంగా వచ్చిన ఆర్‌టిసి బస్సు నెం. (ఎపి01జడ్0043) గల బస్సు ఒక్కసారిగా వారిపైకి దూసుకు రావడంతో రమణయ్య భార్య, కుమారుడు అక్షిత్‌ల తలలపై నుంచి బస్సు  వెళ్లాడంతో తలల నుంచి మొదడు బయటపడి అక్కడికక్కడే మృతి చెందారు. రమణయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Comments

comments