Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

మోటో జి6 ప్లస్ స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది….

Moto G6 Plus is coming to India soon

ముంబయి: ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ మోటోరోలా తన నూతన స్మార్ట్ ఫోన్ “మోటో జి6 ప్లస్” త్వరలో రిలీజ్ చేయనుంది. ఈ విషయాన్ని మోటోరోలా సంస్థ తన ట్విట్టర్ ఖాతాలో ద్వారా తెలియజేసింది. ఈ ఫోన్ లో ప్రస్తుతం స్నాప్‌డ్రాగన్ 630 ప్రాసెసర్ అందుబాటులో ఉంది. అంతేకాదు ఫోన్ విడుదలయ్యే సరికి 630 ప్రాసెసర్ కి బదులుగా స్నాప్‌డ్రాగన్ 636కి అప్ గ్రేడ్ చేసే అవకాశాలు ఉన్నాయని సంస్థ వెల్లడించింది. వినియోగదారులకు పలు ఆకట్టుకునే ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి. ఈ ఫోన్ ధర రూ.20,000 అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

మోటో జి6 ప్లస్  అద్భుత ఫీచర్లు…

5.99ఇంచ్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే, 1080×2160పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్

12/5 మెగాపిక్సల్ డ్యూయల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా

 3/4జిబి ర్యామ్, 32/64జిబి ఇంటర్నల్ స్టోరేజ్

3200ఎంఏహెచ్ బ్యాటరీ.. కాగా ఈ ఫోన్ వి ఆగష్టు రెండో వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది.

Comments

comments