Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

ప్రపంచంలోనే తొలి 5జి స్మార్ట్‌ఫోన్

Moto Z3 is the world's first 5G smartphone

ముంబయి: ప్రముఖ ఎలక్ట్రానిక్ తయారుదారు సంస్థ మోటోరోలా ప్రపంచంలోనే తొలి 5జి స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. మోటో జెడ్3 పేరుతో ఈ ఫోన్ మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. 5జి మోటో మోడ్ ఉన్న ఈ మెబైల్ ను షికాగోలో జరిగిన ఓ ఈవెంట్‌లో రిలీజ్ చేశారు. వెరిజాన్ 5జి నెట్‌వర్క్‌ను యాక్సెస్ చేయగలిగిన తొలి స్మార్‌ఫోన్ మోటో జెడ్3. క్వాల్‌కామ్‌తో కలిసి మోటోరోలా సంస్థ ఈ ఘనతను సాధించింది. స్నాప్‌డ్రాగన్ ఎక్స్50 మోడెమ్‌ను ఉపయోగించుకొని ఈ ఫీట్ సాధించినట్టు మోటోరోలా ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది.

మోటో ‘జెడ్3’ 5జి స్మార్ట్‌ఫోన్ అద్భుత ఫీచర్లు…

మోటో జెడ్ 3 ఫోన్ 6 అంగుళాల మ్యాక్స్ విజన్ ఫుల్ హెచ్‌డీ+ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే

అల్యూమినియం బాడీ, 2.5 డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ డిస్‌ప్లే, 4 జిబి ర్యామ్, 64 జిబి స్టోరేజ్‌

3000 ఎంఏహెచ్ బ్యాటరీ, డ్యుయల్ స్మార్ట్ కెమెరా విత్ గూగుల్ లెన్స్

ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఆండ్రాయిడ్ ఓరియో ఆపరేటింగ్ సిస్టమ్ ఈ స్మార్ట్ ఫోన్ లో ఉన్నాయి. వెరిజాన్ ద్వారా ఆగష్టు 16 నుంచి అమెరికాలో మోటో జెడ్3 ఫోన్ అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ ధరను 480 డాలర్లుగా సంస్థ నిర్ణయించారు. 5జి మోటో మోడ్ 2019 నుంచి అమెరికాలోకి అందుబాటులోకి వస్తుందని కంపెనీ స్పష్టం చేసింది.

Comments

comments