Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

విద్యుత్ షాక్‌తో మోటర్ మెకానిక్ మృతి

Motor mechanic Dies With Electrical Shock
మన తెలంగాణ/కురవి ః ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌తో మెకానిక్ మృతి చెందిన సంఘటన తూర్పుతండాలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం కురవి పోలీస్ స్టేషన్ పరిధిలోని మాధవాపురం గ్రామానికి చెందిన ఎపూరి రాజయ్య(55) ప్రైవేటుగా మోటర్ మెకానిక్ పనిచేస్తు జీవనం కొనసాగిస్తున్నాడు. అయ్యగారిపల్లి సబ్‌స్టేషన్ పరిధిలో వెల్ఫర్‌గా పనిచేస్తున్న వివేక్ శుక్రవారం మాదవాపురం గ్రామానికి వెళ్ళి మెకానిక్ రాజయ్యను గ్రామ శివారు తూర్పుతండా శివారులో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ ఫీజ్ వేయాలని చెప్పి ఎల్ఫర్ ఎల్‌సి తీసుకోకుండా ఎడి ఆఫ్ చేశాడు. ట్రాన్స్‌ఫారం ఫీజ్ వేయాలని చెప్పి మెకానిక్ రాజయ్యను పైకి ఎక్కించాడు. అయితే ఎల్ఫర్ ఎడి స్విచ్ ఆఫ్ చేసిన క్రమంలో ఒక ఫేస్‌కు బైండింగ్ చుట్టి వుండటం వల్ల కరెంట్ సరఫరా అయింది. దీంతో మెకానిక్ రాజయ్య అక్కడికక్కడే మృతి చెందాడు.  గ్రామస్తులు, కుటుంబ సభ్యులు అయ్యగారిపల్లి గ్రామంలోని సబ్‌స్టేషన్ ముందు 365 జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దీంతో మూడు గంటల పాటు వాహనాలు ఎక్కడికక్కడే స్థంబించాయి. విషయం తెలుసుకున్న కురవి ఎస్‌ఐ నాగభూషణం సంఘటన స్థలంకు చేరుకుని ఆందోళనను చెదరకొట్టే ప్రయత్నం చేశారు. కానీ ఆంధోళన కారులు విద్యుత్ అధికారులు రావాలని చెప్పి ఉదృక్తం చేశారు. మహబూబాబాద్ సిఐ ముత్తిలింగయ్య, రూరల్ ఎస్‌ఐ జితేందర్‌లతో పాటు మండల విద్యుత్ ఎడి సురేందర్, ఎఇ రమణనాయక్ అక్కడికి చేరుకుని మృతుని సంఘటన తెలుసుకుని రాజయ్య మృతికి కారకులైన ఎల్ఫర్ వివేక్‌ని సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే మృతుని కుటుంబ సభ్యులకు ఆర్థిక సహయం కింద రూ.5 లక్షలతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోంగం కల్పిస్తామని హమీ ఇచ్చారు. ప్రస్తుతం దహన సంస్కరాల కింద రూ. 50 వేలు అందించారు. దీంతో ఆందోళన కారులు విరమించారు. మృతునికి భార్య రమ, కుమారుడు భరత్, కూతురు భార్గవిలు ఉన్నారు.

Comments

comments