Home జయశంకర్ భూపాలపల్లి ములుగు జిల్లాకై ఐక్య ఉద్యమం

ములుగు జిల్లాకై ఐక్య ఉద్యమం

మాజీ ఎంఎల్‌ఎలు సీతక్క, వీరయ్య
మంత్రి చందూలాల్
ఇంటి ఎదుట మోగిన చావుడప్పు
జిల్లా నినాదాలతో మార్మోగిన పట్టణం

we want Mulugu Districtములుగు : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజనలో ములుగుకు తీరని అన్యాయం జరిగిందని, ములుగు జిల్లాగా సాధించుకునేందుకు ఇకనుండి ఐక్యంగా ఉద్యమిస్తామని మాజి ఎంఎల్‌ఎలు ధనసరి అనసూయ(సీతక్క), పొదెం వీరయ్యలు పేర్కొన్నారు. ములుగు జిల్లా మలి దశ ఉద్యమంలో భాగంగా శనివారం ములుగులోని మంత్రి చందూలాల్ ఇంటి ఎదుట నాయకులు చావుడప్పు కార్యక్రమాన్ని చేపట్టారు. ఉద్యమకారులు జై ములుగు జిల్లా అంటూ చేపట్టిన నినాదాలతో పట్టణం మార్మోగింది.

అంతకుముందు ఉద్యమకా రులు జాతీయ రహదారిపై డప్పుచప్పుళ్లతో భారీ ర్యాలీ చేపట్టారు. మంత్రి ఇంటి ఎదుట చావుడప్పు మోగిస్తున్నారనే విషయం తెలుసుకున్న సిఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ మల్లేష్‌యాదవ్‌ల ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన వద్దకు చేరుకున్నారు. చట్టవ్యతిరేక కార్యక్రమం చేపట్టడం సరైందికాదని ఉద్యమకారులను, మాజి ఎంఎల్‌ఎలకు నచ్చ జెప్పారు. అయినప్పటికీ వారు వినకుండా తమ కార్యక్రమాన్ని నిర్వహిం చారు. చేసేది ఏమీలేక పోలీసులు నిరసన కారులను మంత్రి ఇంటి ఎదుట నుండి లాగేశారు. ఈసందర్భంగా మాజి ఎంఎల్‌ఎలు సీతక్క వీరయ్యలు మాట్లాడుతూ… ఈ ప్రాంత ప్రజల అభీష్టం మేరకే ములుగు జిల్లా ఉద్యమం నడుస్తుందని అన్నారు.

ములుగు జిల్లాను అడ్డుకుంటామని ఏటూరునాగారం నుండి కొంతమందితో మంత్రి చందూలాల్, అతని తనయుడు ప్రహ్లాద్‌లు ప్రకటనలు చేయిం చడం సిగ్గుచేటని అన్నారు. ఈప్రాంతంలో పుట్టి పెరిగిన మంత్రి చందూలాల్ ఈ ప్రాంత ప్రజల కోరిక  మేరకు అసెంబ్లీ సమావేశాల్లో ఒక్కసారి కూడా ములుగు జిల్లా అంశాన్ని మాట్లాడకపోవడం బాధాకరమని అన్నారు. తెలంగాణోద్యమంలో టిఆర్‌ఎస్ నాయకులు ఇలాంటి నిరసన కార్యక్రమాలు ఎన్నో చేపట్టారని, అలాంటిది ములుగు జిల్లా కోసం నేడు ఉద్యమాలు చేస్తుంటే ఎందుకు అడ్డు తగులుతున్నారో సమాధానం చెప్పాలని అన్నారు.

ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ములుగును జిల్లాగా సాధించితీరుతామని, అందుకు ఐక్యంగా ఉద్యమిస్తామని వారు తెలిపారు. ఇంటి ముందు చావుడప్పు కొట్టించుకునేస్థాయికి మంత్రి దిగజారడం సిగ్గుచేటని, ఇలాంటి సందర్భం ఎవరికిరా దని, మంత్రి చందూలాల్‌కు ఎందుకు వచ్చిందో తానే ఆత్మవిమర్శ చేసుకోవాలని అన్నారు. ఇప్పటికైనా మంత్రి చందూలాల్ తన పదవికి రాజీనామా చేసి ములుగు జిల్లా ఉద్యమంలో పాల్గొనాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఇలాంటి నిరసన కార్యక్రమాలు మరిన్ని చేపడతామని హెచ్చరించారు.  జిల్లా సాధన సమితి వ్యవస్థా పక అధ్యక్షుడు ముంజాల బిక్షపతిగౌడ్, అఖిలపక్ష కమిటి నాయకులు చింతలపపూడి భాస్కర్‌రెడ్డి, మసరగాని వినయ్‌కుమార్, నల్లెల్ల కుమారస్వామి, ఎండి.అహ్మద్ పాషా,  దేవేందర్, గొల్లపల్లి రాజేందర్‌గౌడ్, పల్లె జయపాల్‌రెడ్డి, వేములపల్లి బిక్షపతి, బాణాల రాజుకుమార్, ఇండ్ల రాజయ్య,  మహేందర్, కలువల సంజీవ, అమ్జద్‌పాషా,  చంద్రయ్య, చింతల పూడి నరేందర్‌రెడ్డి, ఎండి.యూనుస్, సారయ్య,  సూర్యనారా యణ, ముసినపల్లి కుమార్, సూర్యదేవర విశ్వనాథ్, అరిగెల స్వామినాథన్,  రమేష్, దూడబోయిన శ్రీనివాస్, మహేందర్,  శత్రజ్ఞుడు, వెంకటేశ్వ ర్‌రెడ్డి, ముస్తాఫా, తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.