Search
Monday 24 September 2018
  • :
  • :

శ్రీరెడ్డిపై నిషేదం ఎత్తివేసిన ‘మా’

Tollwood Actress Sri Reddy

Tollywood Actress Sri Reddy

హైదరాబాద్: టాలీవుడ్ నటి శ్రీరెడ్డిపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) విధించిన నిషేధం ఎత్తివేశారు. శ్రీరెడ్డికి పలు సంఘాల నుండి పెరుగుతున్న మద్దతుతో ‘మా’ దిగివచ్చింది. ‘మా’కు ఎవరిపైనా కోపతాపాలు లేవు అని తెలిపింది. శ్రీరెడ్డిపై నిషేధాన్ని పున:పరిశీలించాలని మూవీ ఆర్టిస్టులు కోరడంతో నిర్ణయం తీసుకున్నామని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీ రాజా పేర్కొన్నారు. త్రైమాసికంగా జరిగే సమావేశాల్లో సభ్యత్వాలపై నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు. ఎవరిని పెట్టి సినిమాలు తియ్యాలో దర్శకులు, నిర్మాతల ఇష్టం. శ్రీరెడ్డి చేసిన ఆరోపణలతో మనస్తాపం చెందామని చెప్పారు. మూవీ ఆర్టిస్టులందరూ ఆమెతో నటిస్తారని ఈ సందర్భంగా ‘మా’ తెలిపింది.
టాలీవుడ్ పరిశ్రమలో మహిళ ఆర్టిస్టులపై జరుగుతున్న లైంగిక వేధింపులను అరికట్టేందుకుగాను కమిటీ అగెయినెస్ట్స్ సెక్యువల్ హెరాస్మెంట్ (క్యాష్)ను ఏర్పాటు చేయనున్నట్లు ‘మా’ తెలిపింది.

Comments

comments