Home వార్తలు ఎపి సిఎం చంద్రబాబు నాయుడిపై ‘చంద్రోదయం’

ఎపి సిఎం చంద్రబాబు నాయుడిపై ‘చంద్రోదయం’

apcmఎపి నారా చంద్రబాబు ప్రజలకు చేసిన సేవలు, ఆయన ప్రజలకు చేరువైన విధానాన్ని ముఖ్యాంశంగా తీసుకొని శ్రీ శ్వేతార్క గణపతి ఎంటర్‌ప్రైజెస్ బ్యానర్‌పై ఓ చిత్రం తెరకెక్కనుంది. వెంకటరమణ పసుపులేటి దర్శకత్వం లో డివివి సాయికుమార్, వెంకటరమణ పసుపులేటిలు సం యుక్తంగా నిర్మిస్తున్న మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ ‘చంద్రో దయం’. ఈ చిత్రాన్ని ఆగస్టు 4న ఒంగోలులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు రాజకీయ ప్రముఖుల సమక్షంలో ప్రారం భించనున్నారు. ఈ చిత్రం బ్రోచర్‌ను ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆవిష్కరించారు. కార్తీక్, పల్లవి శ్రేష్ట, అభిషేక్, శ్రీదేవి, రవివర్మ, పూజిత, సానిత, వర్ష, హరీష్, మలినేని లక్ష్మయ్య, హేమసుందర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీః సుధాకర్ రెడ్డి, సహ నిర్మాతలుః గిత్తలూరి వెంకట కృష్ణారావు, కాకు మల్లిఖార్జున యాదవ్, చింతమ సుబ్బారావు. రాజ్‌కిరణ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.