Search
Wednesday 21 November 2018
  • :
  • :

కుంభకోణంలో పోరాట ఘట్టాలు

Balaiah

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 102వ చిత్రాన్ని కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సి.కళ్యాణ్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం కుంభకోణంలో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. అక్కడ జరుగుతున్న భారీ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలతో పాటు పోరాట ఘట్టాల్ని తెరకెక్కిస్తారు. ఈ షెడ్యూల్‌లో ప్రధాన తారాగణమంతా పాల్గొంటుంది. బాలయ్య సరసన నయనతార కథానాయికగా నటించనుండగా మరో నాయికగా నటాషా దోషి ఎంపికైన సంగతి తెలిసిందే. ప్రకాష్‌రాజ్, మురళీమోహన్, బ్రహ్మానందం, జయప్రకాష్ రెడ్డి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. చిత్ర నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ ‘భారీ బడ్జెట్‌తో అత్యాధునిక సాంకేతిక నైపుణ్యంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఎం.రత్నం అద్భుతమైన కథను అందించారు. శ్రీరామరాజ్యం, సింహా వంటి బ్లాక్‌బస్టర్ల అనంతరం బాలకృష్ణ సరసన నయనతార నటిస్తున్న చిత్రమిది. ఇక రామోజీ ఫిలింసిటీలో నిర్మించిన భారీ సెట్‌లో  ఆగస్టు 3 నుండి 30 రోజులపాటు చిత్రీకరణ జరిగింది. ఇప్పుడు కొత్త షెడ్యూల్ కుంభకోణంలో మొదలైంది. ఆదివారం నుండి బాలకృష్ణ సెట్‌లో అడుగుపెట్టారు’ అని అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రాంప్రసాద్, మ్యూజిక్:  చిరంతన్ భట్, ఆర్ట్: నారాయణ రెడ్డి.

Comments

comments