Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

ఫాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో…

NagarJuna

మల్టీస్టారర్ మూవీ ‘దేవదాసు’లో నానీతో కలిసి నాగార్జున నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే చాలా కాలం తర్వాత ఈ సీనియర్ స్టార్ బాలీవుడ్‌లో  ‘బ్రహ్మాస్త్ర’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సందర్భంగా ఈ సినిమాలోని నటీనటులతో కలిసి నాగార్జున దిగిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అమితాబ్‌బచ్చన్, రణబీర్ కపూర్ నటిస్తున్నారు. ఈ సినిమాలో ఎవరి పాత్రలు ఏంటి అనే వివరాలు బయటికి చెప్పడం లేదు కానీ ‘బాహుబలి’ తరహాలో ఫాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రూపొందుతోందని తెలిసింది. నమ్మశక్యం కాని రీతిలో ఇందులో సన్నివేశాలు, ఘట్టాలు ఉంటాయట.  నాగార్జున కూడా ఇప్పటిదాకా ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్‌డేట్స్‌ను తెలుగు మీడియాతో కానీ తన ట్విట్టర్‌లో కానీ షేర్ చేసుకోలేదు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. అమితాబ్‌తో 90వ దశకంలో వచ్చిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘ఖుదాగవా’ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు బిగ్-బితో కలిసి నటిస్తున్నాడు నాగార్జున. ‘బ్రహ్మస్త్ర’లో అలియాభట్, మౌని రాయ్, తిజోరి, దివ్యేన్దు శర్మ, పరస్ అరోరా ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై 200 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది.

Comments

comments