Search
Monday 24 September 2018
  • :
  • :

వెంకటేశ్ – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో

Venky

వెంకటేశ్ హీరోగా చాలా కాలం క్రితం వచ్చిన నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి సినిమాలు ఘన విజయం సాధించి ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. విజయ్‌భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాలకు కథ, మాటలను అందించారు నేటి స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ ఓ సినిమా చేయబోతుండడం విశేషం. బుధవారం వెంకటేష్ పుట్టిన రోజును పురస్కరించుకొని ఈ సినిమాను నిర్మిస్తున్న హారిక అండ్ హాసిని క్రియేషన్స్ వారు ఒక పోస్టర్‌ను రిలీజ్ చేశారు. తమ బ్యానర్‌లో ప్రొడక్షన్ నం.6గా వెంకటేష్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఈ చిత్రాన్ని చేస్తున్నట్లు వారు ప్రకటించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో విభిన్నమైన కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు.

Comments

comments