Home తాజా వార్తలు ముస్తాబైన ఎన్టీఆర్ కథానాయకుడు

ముస్తాబైన ఎన్టీఆర్ కథానాయకుడు

Movie release date of Sr NTR biopic announced

 

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన ‘ఎన్టీఆర్-కథానాయకుడు’ చిత్రం సెన్సార్ పనులను పూర్తి చేసుకొని ‘యు’ సర్టిఫికెట్‌ను పొందింది. ఎలాంటి సెన్సార్ కట్స్ లేకుండా 2 గంటల 50 నిమిషాల నిడివితో ఈ చిత్రం ఈ నెల 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విద్యాబాలన్, రకుల్‌ప్రీత్ సింగ్ ప్రకాష్‌రాజ్, రానా దగ్గుబాటి, సుమంత్, కల్యాణ్‌రామ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ 10 మిలియన్ వ్యూస్‌తో మంచి స్పందన దక్కించుకోవడంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్న ఈ చిత్రానికి జ్ఞానశేఖర్ వి.ఎస్. సినిమాటోగ్రఫీ బాధ్యతలను నిర్వర్తించారు. ఈ చిత్రంలో నరేష్ వి.కె, మురళీశర్మ, కైకాల సత్యనారాయణ, నిత్యామీనన్, బ్రహ్మానందం తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.

Movie release date of Sr NTR biopic announced

Telangana Latest News