Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ కాంబినేషన్ లో మూవీ ప్రారంభం

kajal-agarwal

హైదాబాద్: డైరెక్టర్ తేజ, యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కబోతుంది. సోమవారం  హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. సీనియర్  దర్శకుడు వి.వి.వినాయక్ చేతుల మీదుగా ఈ సినిమా ప్రారంభమైంది. వినాయక్ క్లాప్ కొట్టగా,  ఇటీవల బెల్లంకొండ శ్రీనివాస్ తో ‘సాక్ష్యం’ సినిమా చేసిన శ్రీవాస్ ముహూర్తపు సన్నివేశానికి కెమెరా స్విచ్చాన్ చేశారు. తొలి షాట్ కు తేజ గౌరవ దర్శకత్వం వహించారు. అనిల్ సుంకర నిర్మిస్తోన్నఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ కు జోడీగా అగ్ర కథానాయిక కాజల్  అగర్వాల్ నటిస్తోంది. కాగా, తేజ దర్శకత్వంలో రాజల్ కి ఇది 3వ సినిమా.ఇక  ప్రముఖ నటుడు  సోనూ సూద్ ఈ సినిమాలో ఓ కీలక  పాత్ర పోషించనున్నాడు. ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించనున్నాడు.

KAJA-SAI

ssai

Comments

comments