Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

కాంగ్రెస్ నేతలపై ఎంపి బాల్క సుమన్ ఫైర్

MP balka suman fires on congress leaders
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేతలు చేస్తున్నఆరోపణలను ఎంపి బాల్క సుమన్ ఖండించారు. శనివారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నేతలు తమపై బురదజల్లడం తగదన్నారు. ప్రధాని మోడీ వద్ద సిఎం కెసిఆర్ మోకరిల్లలేదని, చంద్రబాబు ముందు కాంగ్రెస్ మోకరిల్లిందని బాల్క సుమన్ అన్నారు. టిఆర్ఎస్ పై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాన్నితెలంగాణ ప్రజలు నమ్మరని, పక్క రాష్ట్రాలతో సత్సంబంధాలు కోరుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వంలో టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఉండే సంబంధం మాత్రమే తెలంగాణకు ఉందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సభకు ఉస్మానియా యూనివర్శిటీలో అనుమతి లభించకపోవడంపై ఎంపి మాట్లాడారు. ఒయులో రాజకీయపార్టీల సభలకు అనుమతి లేదన్నారు. రాహుల్ గాంధీ సభకు అనుమతి రాకపోవడంపై కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్నవిమర్శలు సరైనవి కావని ఆయన చెప్పారు.

Comments

comments