Home తాజా వార్తలు ఆంధ్రోళ్ల దగ్గర తెలంగాణను తాకట్టు పెట్టొద్దు

ఆంధ్రోళ్ల దగ్గర తెలంగాణను తాకట్టు పెట్టొద్దు

mp

మంచిర్యాల: నన్ను ఆశీర్వదించడండి.. చెన్నూర్ నియోజక వర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తానని ఎంపి బాల్క సుమన్ అన్నారు. చెన్నూర్ నియోజక వర్గ టిఆర్‌ఎస్ పార్టి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను అత్యధిక మెజార్టితో గెలిపించాలని ప్రజలను కోరారు. శుక్రవారం కోటపల్లిలో ముందుగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం శెట్‌పల్లి గ్రామంలో  ఎమ్ఎల్ సి పురాణం సతీష్ కుమార్, మాజి ఎమ్ఎల్ఎ ఓదెలుతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టిఆర్ఎస్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల ప్రగతీ , అభివృద్ది ధ్యేయంగా పని చేసిందన్నారు. గ్రామాలలో నెలకొన్న సమస్యలను సమూలంగా రూపుమాపాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రణాళిక బద్దంగా పథకాలను ప్రవేశపెట్టి అమలు చేయడం జరిగిందన్నారు . గతంలో ఏ గ్రామానికి వెళ్లాలన్న మోకాలు లోతు బురదలో నడిచి వెళ్లాల్సిన పరిస్థితులు ఉండేవని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఈ నాలుగున్నర సంవత్సరాలలో పల్లెల రూపురేఖలు మారయన్నారు. అంతర్గత రహదారుల నిర్మాణం చేపట్టి గ్రామాలల్లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేసిన ఘనత టిఆర్‌ఎస్ ప్రభుత్వానిదేన్నారు. రైతు బంధు, రైతు బీమా ఆసరా ఫించన్లు, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రభుత్వం చేపట్టిన పథకాలు నాలుగు వందల పైచిలుకు ఉంటాయన్నారు. దేశంలో తెలంగాణ రాష్ట్రం 17.17శాతం వృద్ధిరేటుతో నంబర్‌వన్ రాష్ట్రంగా నిలిచిందన్నారు. మహాకూటమి ఓ దొంగల కూటమని మండిపడ్డారు. మహాకూటమి మాటలను నమ్మి ఆంధ్రోళ్ల దగ్గర తెలంగాణను తాకట్టు పెట్టొద్దని కోరారు. కిరణ్‌కుమార్‌ రెడ్డి, చంద్రబాబు తెలంగాణకు కరెంట్, నీళ్లు రావని చెబుతూ.. అభివృద్ధిని అడ్డుకున్నారన్నారు. మహాకూటమి ద్వారా ప్రజలను మరోసారి మోసం చేసేందుకు వస్తున్నారని, దొంగల కూటమికి అవకాశమిస్తే అభివృద్ధి ఆగిపోతుందన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం సిఎం కెసిఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని బాల్క సుమన్ అన్నారు.

MP Balka Suman in Mancherial Election campaign