Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి సిఎం కెసిఆర్ కృషి

MP Boora Narsaiah Goud Speech About CM KCr

మనతెలంగాణ/చిట్యాల: పోరాడి సాధించుకున్న తెలంగాణ సమైక్య రాష్ట్రంలో అన్ని విధాలా నష్టపోయిందని, సిఎం కేసిఆర్ నేతృత్వంలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ది సాధిస్తుందని భువనగిరి ఎంపి బూర నర్సయ్యగౌడ్ అన్నారు. ఆదివారం మండలంలోని వట్టిమర్తి గ్రామంలో డబుల్‌బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి  ఎంఎల్‌ఏ వేముల వీరేశంతో కలిసి శంకుస్థ్దాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయ న మాట్లాడారు. వట్టిమర్తి గ్రామంలో 100 డబుల్ బెడ్ రూం ఇళ్లకు రూ.5కోట్ల4 0లక్షలతో నిర్మించే ఇళ్ల  నిర్మాణానికి నేడు శంకుస్థ్దాపన చేశామన్నారు. త్వరితగతిన ఇళ్లు నిర్మించి అర్హులైన లబ్దిదారులకు అందజేస్తామన్నారు.  సిఎం కేసిఆర్ కృషి వల్లనే 60 ఏళ్లుగా సమైక్య రాష్ట్రంలో జరగని అభివృద్ది కేవలం నాలుగు సంవత్సరాల్లోనే అభివృద్ది జరిగింద న్నారు. ధర్మారెడ్డి,పిల్లాయిపల్లి కాలువ ద్వారా రైతాంగానికి గత పాలకులు నిర్లక్షం చేయటంతో రైతాంగానికి సకాలంలో సాగు నీరం దలేదని , రైతాంగాన్ని మోసగించారని అన్నారు. సిఎం కేసిఆర్ ఈ కాలువలవిషయంలో స్పందించి 350 కోట్లు నిధులను విడుదల చేశారని, త్వరలోనే కాలువల నిర్మాణం పనులు పూర్తవుతాయని అన్నా రు. సిఎం కేసిఆర్ ప్రతిష్టాత్మకగా చేపట్టిన రైతుబందు పధకం ద్వారా రై తులు తమ పొలాల్లో అడుగుపెట్టి వ్యవసాయం దిశగా అడుగులు వేస్తున్నారని అన్నారు. మూసీ ప్రాజెక్టు కింద వున్నటువంటి ఎడమ కాలువలకు రెండు దశాబ్డాల తరువాత రెండవ పంటకు నీరందిస్తున్న ఘనత సిఎం కేసిఆర్ కే దక్కుతుందన్నారు. పేద ప్రజలకు గూడు వుండాదలన్న ఉద్దేశ్యంతో ఒక్క పైసా ఖర్చు లేకుండా వారికి డబుల్‌బెడ్ రూం ఇండ్లను ప్రభుత్వమే కట్టిస్తుందన్నారు.వట్టిమర్తిలో ఎల్‌ఇడి లైట్లకు నిధులు మంజూరు చేస్తానన్నారు. నకిరేకల్ ఎంఎల్‌ఏ వేముల వీరేశం మాట్లాడుతూ నియోజకవర్గ ప్రాంత ప్రజలకు రైతులకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వా రా గోదావరి జలాల నందించేందుకు సిఎం కేఇసార్ ఎంతో శ్రమిస్తునానారని , ఇచ్చిన మా ట ప్రకారం కాళేశ్వరం నీటిని అందిస్తామన్నారు.  ఈ కార్యక్రమంలో ఎంపిపి బుట్ట అరుణఅయిలేష్, జడ్‌పటిసి శేపూరి రవీందర్, సర్పంచ్ బూరుగు కృష్ణ వేణి, సింగిల్ విండో చైర్మన్ నర్రా మోహన్‌రెడ్డి , తహశీల్దార్ విశాలాక్షి, ఎంపి డిఓ కాంతమ్మ, ఎంపిటిసి ఎద్దులపురి క్రిష్ణ ,మండల పార్టీ అధ్యక్ష, కార్యద ర్శులు కాటం వెంకటేశం, పల్లపు బుద్దుడు, పాటి నర్సిరెడ్డి, పాల్గొన్నారు

Comments

comments