Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

శరత్ కుటుంబ సభ్యులను పరామర్శించిన దత్తాత్రేయ

Dattatreya

హైదరాబాద్: అమీర్ పేట్ లో శరత్ కుటుంబ సభ్యులను బిజెపి ఎంపి దత్తాత్రేయ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.  శరత్ మృతితో అమెరికాలోని తెలుగు విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. ప్రజాస్వామ్య దేశంగా భావించిన అమెరికాలో ఇలా జరగడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మృతదేహాన్ని హైదరాబాద్ తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని, ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోడీతో చర్చించానన్నారు. శనివారం కాన్సాస్‌లో గుర్తు తెలియని దుండగుడు జరిపిన కాల్పుల్లో శరత్ మృతి చెందిన విషయం తెలిసిందే.

Comments

comments