Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం చేయూతనందించాలి: ఎంపి దత్తాత్రేయ

MP Dattatreya distributing tricycles
అంబర్‌పేట: దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయూతనందించి వారికి అన్ని రంగాలలో అవకాశాలను కల్పించాలని సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం అంబర్‌పేట మున్సిపల్ స్టేడియంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సామాజిక అధికారిత శిభిర్‌లో పలువురు దివ్యాంగులకు వివిధ పరికరాలను పంపిణీ కార్యక్రమాన్ని నియోజకవర్గం ఎంఎల్ఎ జి. కిషన్‌రెడ్డి, స్థానిక కార్పొరేటర్ పులిజగన్, మండల తహసీల్దార్ చంద్రకళలతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ గతంలో దివ్యాంగులకు కేవలం 3 శాతం మాత్రమే రిజర్వేషన్లు ఉండేవని నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అది 4 శాతానికి పెంపొందించడంతో పాటుగా వారి అభ్యున్నతికి అత్యధిక నిధులను కేటాయిస్తున్నారని తెలిపారు. అయితే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం దివ్యాంగులకు పెంచాల్సిన రిజర్వేషన్లను పెంచడంలేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులందరికి డబుల్ బెడ్‌రూమ్‌ల ఇళ్ల నిర్మాణంలో వారికి ప్రత్యేకంగా కేటాయించాల్సిన అవసరముందని తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలన్ని అర్హులైన వారందరికి చేరుతున్నాయని అందుకు నిదర్శనం నేడు రూ.36 లక్షల విలువైన దివ్యాంగుల సామాగ్రిని పంపిణీ చేయడమేనన్నారు. ఎంఎల్ఎ జి. కిషన్‌రెడ్డి మాట్లాడుతూ నరేంద్రమోడీ ప్రభుత్వం పేదల అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకుని పని చేస్తుందని దివ్యాంగులు కృంగిపోకుండా వారి అవసరాల కోసం వారే తమ పనులను స్వయంగా చేసుకునేందుకు కేంద్రం సామాజిక అధికారిత శిభిర్ పథకం ద్వారా దాదాపు 387 మంది దివ్యాంగులకు చేయూతనందిచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం దివ్యాంగులకు ప్రత్యేకంగా ఉద్యోగ అవకాశాల్లో 4 శాతం రిజర్వేషన్లను కల్పించిందని దానిని సాద్వినియోగం చేసుకోవాలన్నారు. పలు పథకాలను కేంద్రం అమలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడంలో విఫలం అవుతున్నాయని, ప్రయివేటు సెక్టార్లలో కూడా దివ్యాంగులకు రిజర్వేషన్లు కల్పించి వారిని ప్రోత్సహించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర కార్మిక బాలకౌమార వైస్ చైర్మన్ బి.వెంకటరెడ్డి, సాంఘీక సంక్షేమ శాఖ జిల్లా ఆర్గనైజర్ ఎం.సుశీలారెడ్డి, జికె.సునంద, కె.రాజేష్, రాష్ట్ర బిజేపి వికలాంగుల సెల్ కన్వీనర్ శ్రీశైలం, తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Comments

comments