Search
Saturday 21 July 2018
  • :
  • :

జిల్లా ప్రగతిపై ఎంపి ఛలోక్తులు

MP dissatisfied with the performance of postal officers

ఆరు నెలలకు ఒకసారి జిల్లా పర్యవేక్షణ కమిటీ సమావేశం జరగాలి

పోస్టల్ అధికారుల పనితీరుపై ఎంపి అసంతృప్తి

21 మండలాల్లో 95 శాతం మిషన్ భగీరథ పనులు పూర్తయ్యాయి

గిరి పుత్రులకు ఉచిత ఆర్మీ శిక్షణలో ముందంజ

మన తెలంగాణ/ఆసిఫాబాద్ రూరల్ : కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలపై జిల్లా ప్రగతి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ సమావేశం శనివారం నాడు జిల్లా పాలనాధికారి సమావేశ మందిరంలో జరిగింది. ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులు ఎంపి గోడం నగేష్ మాట్లాడుతూ కొత్త జిల్లాల ఆవిర్భావనంతరం ఈ సమావేశం నిర్వహించుకోవడం రెండవసారి అని అన్నారు. ఈ సమావేశం ప్రతి ఆరు నెలలకు ఒకసారి నిర్వహించాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల నిర్వహించుకోలేకపోయామన్నారు. అనంతరం ఆయా శాఖల వారిగా అభివృద్ధి పనులను అడిగి తెలుసుకున్నారు. పోస్టల్ అధికారుల పనితీరు సంతృప్తికరంగా లేనందున వారి పనితీరును మార్చుకోవాలని కోరారు. కొత్త మండలాలకు పిహెచ్‌సిలోఅంబులెన్స్‌లకు ప్రతిపాదనలు పంపామని త్వరలోనే అందుబాటులో ఉంటాయని ఎంపి తెలిపారు.
జిల్లా పాలనాధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ మాట్లాడుతూ ప్రతి రైతు తమ చేలలో సిద్దప్ప గుంట తప్పనిసరిగా ఏర్పాటుచేసుకోవాలని రైతులకు చెప్పడం జరిగిందని అన్నారు. మిషన్ భగీరథ పనులు 1819 హ్యాబిటేషన్లు 21 మండలాల్లో 95 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు. అలాగే గ్రామాలలో మరుగుదొడ్ల నిర్మాణాలపై అవగాహన కల్పించి ఇంటింటికి మరుగుదొడ్లు నిర్మించుకునేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. జిల్లాలో బ్లడ్ బ్యాంక్ మంజూరయ్యిందని పనులు చివరి దశలో ఉన్నాయని జూన్ చివరిలోపు ప్రారంభిస్తామన్నారు. గిరిజన యువతకు ఉచిత ఆర్మీ శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. స్థానిక శాసనసభ్యురాలు కోవ లక్ష్మి మాట్లాడుతూ జిల్లా వైద్యశాఖ కార్యాలయం దగ్గర, షాపులు వేసుకున్నారని, ఒక్కొక్కరికి 2,3 గ్రామపంచాయతీ లిస్టు చూసి వాటిని తొలగించాలని డిపిఓకు సూచించారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటి చైర్మన్ గంధం శ్రీనివాస్, ఎంపిపి తారాబాయి, జిల్లా అధికారులతో పాటు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments