Home నల్లగొండ దేశం యావత్తు చూపు తెలంగాణ రాష్ట్రం వైపు

దేశం యావత్తు చూపు తెలంగాణ రాష్ట్రం వైపు

MP Gutha Sukender Reddy Speech About Ts Devlopment

మన తెలంగాణ/ హాలియా: దేశం యావత్తు తెలంగాణ రాష్ట్రంలో కొన సాగుతున్న పథకాల వైపు చూస్తుందని ఆర్‌ఎస్‌ఎస్ రాష్ట్ర అధ్య క్షుడు, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రం హాలి యాలో ఆదివారం యాదవ, బం జారా సేవా సంఘం ఆధ్వర్యంలో ఎంపీలు గుత్తా, బడుగుల, రాం చందర్‌నాయక్‌లకు నిర్వహించిన సన్మాన సభకు హాజరై మాట్లాడుతూ రాష్టారనికి సరైన నాయకుడు కేసీఆరే అని కోటి ఎకరాలకు సాగునీరు అందించే లక్షంతో టీ ఆర్‌ఎస్ ప్రభుత్వం ఒ క లక్ష 50వేల కోట్ల తో సాగునీటి ప్రాజె క్టుల నిర్మాణంతో ముం దుకు వెళ్తుందని ఇటీవల డిండి ఎత్తిపో తలకు 6,500 కోట్ల నిధులు మంజూరు చేశారని వరద కాల్వ ద్వారా 80వేల ఎకాలకు సాగునీరు అందింస్తున్నామని, అదే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు రెండున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందనున్నట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో రైతులు ఆందోళన చెందుతున్నారని వారికి మార్గదర్శిగా తెలంగాణలోని రైతుబంధు పథకం పని చేస్తుందని రైతులకు మొదటి దశగా 6వేల కోట్లు పంపిణీ చేశామని, అదే విధంగా 57 లక్షల మంది రైతులకు భీమా సౌకర్యం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు చెప్తున్న 2లక్షల రుణమాఫీ సాధ్యం కాదని అలా ఇస్తే 2 సంవత్సరాల వర కు రాష్ట్రంలో ఎవరికి జీతాలు ఇవ్వకుండా నిలపాల్సి ఉంటుందని, అదే విధంగా కొనసాగుతున్న ప్రాజెక్టులకు నిధులు నిలిపివేయాల్సి ఉంటుందన్నారు.

ప్రాజెక్టులు పూర్తి చేయించుకునే బాధ్యత ప్రజలదే అన్నారు. రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ మాట్లాడుతూ గత పాలకులు రైతు నడ్డి విరాచయని నేడు రాష్ట్రంలో రైతును రాజుగా చేసే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నాడని 1 కోటి 50 లక్షల బడ్జెట్‌లో 40వేల కోట్ల రూపాయలతో 40 సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తున్నట్లుపేర్కొన్నారు. కాంగ్రెస్ వారు మోకాళ్ల యాత్ర చేసినా ప్రజలు నమ్మరని ఎద్దెవ చేఊశారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలు, రైతుల ఇబ్బందులను తొలగిస్తున్నప్రభుత్వం టీఆర్‌ఎస్‌ది అని, పుట్టిన దగ్గర నుంచి గిట్టే వరకు సీఏం కేసీఆర్ ప్రతి వ్యక్తికి లబ్ది చేకూరే విధంగా పథకాలు రూపొందించినట్లు పేర్కొన్నారు. ఎమ్‌ఎల్‌సీ రాములునాయక్ మాట్లాడుతూ సారా, కారా, కూరాకు ఆశపడి ఓట్లు వేయవద్దని తండాలను గ్రామ పంచాతీలుగా చేసిన ఘనత టీఆర్‌ఎస్‌దే అన్నారు. టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ నోముల నర్సింహాయ్య మాట్లాడుతూ నియోజకవర్టంలో కేసీఆర్ చొరవతో 19వేల యాదవ సంఘాలకు 40వేల మంది యాదవులకు లబ్దిచేకూరిందన్నారు. జానా 80 శాతం యాదవులు నావెంటే ఉన్నారనడం హస్యాస్పదం అన్నారు. ఈసందర్‌భంగా నియోజకవర్గంలో యాదవ, బంజారా సంఘం భవనాల నిర్మాణాలకుచేయూనివ్వాలని రాంమ్మూర్తియాదవ్ కోరగా దానికి వక్తలు సానుకూలంగా స్పందించారు. అంతకు ముందు ఆర్‌అండ్‌బి అతిధి గృహం నుంచి సభావేదిక లక్ష్మినర్సింహా గార్డెన్స్ వరకు డీజే సౌండ్ల మధ్య కార్యకర్తల నృతాయల నడుమ భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎంపీలు గుత్తా, బడుగుల, రాంచందర్‌నాయక్‌లను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు.

మాజీ ఎమ్మెల్యే గుండెబోయిన రాంమ్మూర్తియాదవ్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఎంబీసీ చైర్మన్ తాండూరు శ్రీనివాస్, ఆర్‌ఎస్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఇస్లావత్ రాంచందర్‌నాయక్, యడవల్లి విజయేందర్‌రెడ్డి, గడ్డంపల్లి రవీందర్‌రెడ్డి, రావుల చినబిక్షం, గోవర్థన్‌యాదవ్, కూరాకుల వెంకటేశ్వర్లు, నూకల వెంకట్‌రెడ్డి, కర్ణ బ్రహ్మానందరెడ్డి, నోముల భగత్, కేతావత్ బిక్షానాయక్, గజ్జెల లింగారెడ్డి, జటావత్ రవినాయక్, అనుముల శ్రీనివాస్‌రెడ్డి, బోనూతల నరేందర్, కోనాల శివయ్య, చల్లా మట్టారెడ్డి, చేగొండి కృష్ణా, ఎన్నమల్ల సత్యం, రంజిత్‌యాదవ్, పోషం శ్రీనివాస్‌గౌడ్, గుంటుక వెంకట్‌రెడ్డి, బొల్లం రవి, శ్రీను, కిరణ్, మేరెడ్డి జైపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.