Home తాజా వార్తలు తెలంగాణ విద్యార్థులను విడిపించండి : జితేందర్ రెడ్డి

తెలంగాణ విద్యార్థులను విడిపించండి : జితేందర్ రెడ్డి

MP Jithender Reddyఢిల్లీ : అమెరికాలో అరెస్టైన తెలంగాణ విద్యార్థులను విడిపించాలని తెలంగాణ ఎంపి జితేందర్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం ఆయన లోక్ సభలో మాట్లాడారు. అమెరికాకు చెందిన హ ోమ్ లాండ్ సెక్యూరిటీ నకిలీ యూనివర్సిటీని ఏర్పాటు చేసి విదేశీ విద్యార్థులకు గాలం వేసిందని ఆయన పేర్కొన్నారు. పే టూ స్టే పేరుతో విద్యార్థులకు వల వేసిందని ఆయన చెప్పారు. ఆ నకిలీ యూనివర్సిటీని నమ్మిన 600 మంది విద్యార్థులు మోసపోయారని, ఈ క్రమంలో వారిని అరెస్టు చేశారని, అరెస్టైన వారిలో తెలంగాణ విద్యార్థులు కూడా ఉన్నారని ఆయన తెలిపారు. తెలంగాణకు చెందిన విద్యార్థులు 129 మందిని ఇప్పటి వరకు అరెస్ట్ చేశారని జితేందర్ రెడ్డి చెప్పారు. అది నకిలీ యూనివర్సిటీ అని విద్యార్థులకు తెలియదని, వాళ్లు యుఎస్‌కు అక్రమంగా వెళ్లలేదని ఆయన తేల్చి చెప్పారు.   హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ జనరల్‌తో టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఈ విషయంపై ఇప్పటికే  మాట్లాడారని, దీనికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు కాన్సులేట్ జనరల్ ద్వారా తెలుసుకుంటున్నట్టు జితేందర్ రెడ్డి వెల్లడించారు. అయితే ఉన్నత చదువుల కోసం లక్షలు ఖర్చు చేసి అమెరికా వెళ్లి ఇబ్బంది పడుతున్న తెలంగాణ విద్యార్థులను రక్షించేందుకు , వారిని  భారత్ కు రప్పించేందుు చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆయన కోరారు.