Home తాజా వార్తలు ఓటేసేందుకు క్యూలో కవిత

ఓటేసేందుకు క్యూలో కవిత

MP Kavitha నిజామాబాద్: తెలంగాణలో పోలింగ్ సాఫీగా కొనసాగుతుంది. శుక్రవారం ఉదయం నుంచే పెద్ద ఎత్తున జనం ఓట్లు వేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే, టిఆర్ఎస్ ఎంపి కవిత నిజామాబాద్ జిల్లా పోతంగల్‌లోని 177వ పోలింగ్ బూత్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాధారణ ఓటర్లతో కలిసి లైన్లో నిలబడి ఆమె ఓటు వేయడం గమనార్హం. ఇప్పటికే మంత్రులు హరీష్‌రావు, జూపల్లి కృష్ణారావు, జగదీశ్‌రెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉదయం 9:30 నుంచి ఇప్పటి వరకు వరకు 14శాతం పోలింగ్ నమోదు అయింది.

TRS MP K Kavitha stands in a queue to cast her vote at polling booth no. 177 in Pothangal, Nizamabad.

MP Kavitha cast her vote