Home తాజా వార్తలు తొలి ఓటుతో మంచికి బాట

తొలి ఓటుతో మంచికి బాట

Mp Kavitha

మొదటి ఓటుతో మంచికి బాటలు వేయండి అభ్యర్థులు చెప్పేవి బేరీజు వేసుకోండి :

కొత్త ఓటర్లతో టిఆర్‌ఎస్ అభ్యర్థి కవిత గంటపాటు సాగిన ఇష్టాగోష్ఠి

ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైన ఓటు హక్కు ను తొలిసారి పొందిన యువతతో సోమవారం నిజామాబాద్ టిఆర్‌ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత బేటీ అయ్యారు. ఎన్నికల ప్రచారంలో సరికొత్త పంథాను ఎంచుకున్న కవిత యువ ఓటర్లతో తన మనోభావాన్ని పంచుకోవాలని భావించారు. అందుకు దాదా పు 2వేల మంది కొత్త ఓటర్లతో సరికొత్త సమావేశానికి నాందిపలికి, దాదాపు గంట సేపు వారితో ఇష్టాగోష్టి నిర్వహించారు. తనకే ఓటేయ్యాలంటూ చెప్పుకోకుండా మంచి, చెడులపై వివరణ ఇచ్చారు. ప్రస్తుత రాజకీయాలను, రాష్ట్ర దేశ, సామాజిక రాజకీయ పరిస్థితులను పూసగుచ్చినట్లు వివరించిన ఆమె ఓటు హక్కు విలువను వారికి వివరించారు. ప్రజాస్వామ్యంలో కీలకమైనఓటు హక్కును వినియోగించుకునే ముందు మంచి, చెడుపై ఆలోచించాలని, అభ్యర్థులు చెప్పిన మాటలు నిజాలో కావో అన్నది నిర్దారించుకోవాలని సూచించారు.

తాము ఎన్నుకునే నేత మంచి వారై ఉండాలని సూచించిన ఆమె మీ ఓటుతో నిజామాబాద్ నగరం, పార్లమెంట్ అభివృద్ది, ప్రతిష్ట ముడిపడి ఉన్నాయని వెల్లడించారు. వారిలో ఉత్సాహాన్ని నింపుతు సాగిన ప్రసంగంలో యువతకు మార్గ నిర్దేశం కనిపించింది. ఈ సందర్బంగా విద్యార్థులు సైతం కవితతో హుషారుగా చర్చలో పాల్గొన్నారు. తమకు కలిగిన సందేహాలను కవితతో మాట్లాడుతూ నివృత్తి చేసుకున్నారు. ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తాతో కలిసి ఇష్టాగోష్టిలో పాల్గొన్న కవిత కొత్త ఓటర్లలో సరికొత్త హుషారును నింపారు. ఈ సందర్బంగా విద్యార్థులు కవితతో పంచుకున్న పలు ప్రశ్నలు,అందుకు కవిత ఇచ్చిన సమాధానాలు ఇలా ఉన్నాయి.
* విద్యార్థి ప్రశ్న : గొప్ప రాజకీయ నేతగా ఎదగాలంటే ఏం చేయాలి
* టిఆర్‌ఎస్ అభ్యర్థి కవిత జవాబు: ప్రజాప్రతినిధులు రెండు రకాలుగా ఉంటారని, పొలిటిషన్,లీడర్ రెండు రకాలు. పొలిటిషన్ అనే వారు కమీషన్ల కోసం పనిచేస్తారు. లీడర్ అనే వారు ప్రజలతో సస్‌సంబంధాలు ఏర్పడి ఉంటాయని, మన సిఎం కెసిఆర్ లాగే ఎప్పుడు ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడేవారిని లీడర్ అంటారు.
* విద్యార్థి: దేశాభివృద్దిలో యువత ఎలాంటి పాత్ర పోశించాలి ?
* కవిత జవాబు: ఓటువేసి ప్రజాప్రతినిధులను గెలిపించడమే కాకుండా ప్రభుత్వం చేసే అభివృద్ది పనులను తప్పుగా ఉంటే నిలదీయాలని, ప్రభుత్వానికి అర్థమయ్యే విధంగా వివరించాలని యువతకు తెలిపారు.
* విద్యార్థి: నూతనంగా ఏర్పడుతున్న రింగు రోడ్డు వల్ల ఇండ్లను కోల్పోతున్నాం ?
కవిత జవాబు: వాస్తవమేనని ఆస్తినష్టం జరిగిన వారికి ప్రభుత్వం తగిన డబ్బులు చెల్లిస్తుందని, నగరాభివృద్ది కోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం తప్పదని కవిత సమాధానం ఇచ్చారు.
* విద్యార్థి: ఎర్రజొన్న రైతుల సమస్య పరిష్కరించారా ?
* కవిత జవాబు: ఎర్రజొన్న రైతుల సమస్యలను పట్టించుకుంటున్నామని, పంట పెరిగిందని, ధర తగ్గిపోతుందని, త్వరలో వారికి పూర్తి మద్దతు ధర ఇస్తామని రైతులతో చర్చించి మేము కొనాలా, ప్రభుత్వం మద్దతు ధర ఇవ్వాలా అని ఆలోచిస్తున్నామని ఆమె వివరించారు. దీనిని కాంగ్రెస్, బిజెపిలు రాద్దాంతం చేస్తున్నారని తెలిపారు.

Mp Kavitha Chit chat With Students in Nizamabad