Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

కవితను జిల్లా ప్రజలే గెలిపించుకుంటారు

Mp Kavitha Do  Devlopment in Nizamabad District

మనతెలంగాణ/ఇందూరు: నిజామాబాద్ జిల్లా అభివృద్ధికి ఎంపి కల్వకుంట్ల కవిత ఎంతో కృషి చేస్తున్నారని, తిరిగి ఆమెను ప్రజలు గెలుపించుకుంటారని టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి అన్నారు. శనివారం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ ఎంపిగా కవితను గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, కొమటిరెడ్డి వెంకటిరెడ్డి రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ప్రజలను మోసం చేసిందని, కరెంటు లేక రైతులు కార్మికులు, వ్యాపారవేత్తలు ఎన్నో కష్టాలు పడ్డారని గుర్తు చేశారు. ఎంపి కవితీ కృషి వల్ల పెద్దపల్లి నిజామాబాద్ రైల్వేలైన్లు పూర్తి చేయించారని, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్       అభివృద్ధికి రూ.100కోట్లు, ఆర్మూర్ మున్సిపాలిటికి రూ.50 కోట్లు, బోధన్ మున్సిపాలిటికి రూ.50కోట్లు మం జూరు చేయించారని అన్నారు. నిజాం షూగర్స్ ఫ్యాక్టరీని తెరిపించడానికి ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు సిద్దంగా ఉన్నారని, ఫ్యాకర్టీకి కావల్సిన స్థాయిలో చెరుకు ఉత్పత్తి కావాలని, కాంగ్రేస్, టీడీపీ హయంలో ఫ్యాక్టరీని, ఫ్యాక్టరీ భూములను అమ్ముకున్నారని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ప్రభుత్వం ఏం చేస్తుందో అందరికి తెలుసని, ఇప్పటికి షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మీ పథకాలతో ఆడ బిడ్డలకు అండగా కేసీఆర్ ఉంటున్నారని అన్నారు. ఇలా ఎన్నో పథకాలతో బంగారు తెలంగాణలో ప్రజలు సంతోషంగా ఉన్నారని, రాబోయే ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్ పార్టీని గెలుపించుకోని ప్రభుత్వానికి ఏర్పాటు చేస్తుందని అన్నారు. కాంగ్రేస్ పార్టీ నాయకులకు ప్రజలే బుద్దిచెప్పుతారని అన్నారు. ఈ సమావేశంలో కార్పొరేటర్ ఖుద్దుస్, నాయకులు రాజేంద్రప్రసాద్, గొపు ప్రభాకర్, నీరడి లక్ష్మణ్ తదితరులు  పాల్గొన్నారు.

Comments

comments