Search
Wednesday 17 October 2018
  • :
  • :

తోడేళ్ల ముసుగు వేసుకొస్తే జనం గుర్తు పట్టరా..?

kvitha

జగిత్యాల : ఎపి సిఎం చంద్రబాబే ఓటుకు నోటు కేసులో సూత్రధారి, పాత్రధారని జీవన్‌రెడ్డి చెప్పారని, ఇప్పుడా సూత్రధారి, పాత్రధారి కాంగ్రెస్ దృష్టిలో నిర్దోషులా? అని ఎంపి కవిత ప్రశ్నించారు.  జీవన్‌రెడ్డి అనుచరులంతా గూండాలు, రౌడీలని చెప్పిన రమణకు ఇప్పుడు వాళ్లు ముద్దొస్తున్నరా?, ఎల్. రమణ ప్రజలకు పనికిరాని నాయకుడని జీవన్‌రెడ్డే అన్నారని.. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న జీవన్‌రెడ్డి, ఎల్. రమణ ఇప్పుడెలా ఒక్కటయ్యారని కవిత విమర్శించారు. జీవన్‌రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు తన భూముల చుట్టూ రోడ్డు వేసుకోలేదా?, తన భూముల ధరలు పెంచుకునేందుకు కొండగట్టు దగ్గర జెఎన్ డియూ ఏర్పాటుకు సహకరించలేదా? అని ఎంపి ప్రశ్నించారు. జీవన్‌రెడ్డి రూ. 16 కోట్ల జనం డబ్బుతో తన తమ్ముళ్ల భూముల చుట్టూ బైపాస్ రోడ్డు వేసిన సంగతి నిజం కాదా? అని మండిపడ్డారు. కాంగ్రెస్ ఆగడాలు భరించలేకనే కెసిఆర్ ఆమరణదీక్షకు దిగారని, మరోసారి తెలంగాణను మోసం చేసేందుకు కాంగ్రెస్, టిడిపి ఏకమయ్యాయని ఆమె విమర్శించారు.  ఉద్యమంలో ఏనాడూ కనిపించని కాంగ్రెస్ నాయకులు నేడు తోడేళ్ల ముసుగు వేసుకొని వస్తే జనం గుర్తు పట్టరా?.. కెసిఆర్ ఓటమి ఎరుగని నాయకుడని, ప్రజల దీవెనతోనే ఆయన ఒక్కసారి కూడా ఓడిపోలేదన్నారు. జగిత్యాల నుంచే టిఆర్‌ఎస్ జైత్రయాత్ర మొదల వుతుందని ఈ సందర్భంగా ఎంపి కవిత పేర్కొన్నారు.

MP Kavitha fire on mahakutami

Telangana News

Comments

comments