Home తాజా వార్తలు బంగారు బోనం ఎత్తిన కవిత

బంగారు బోనం ఎత్తిన కవిత

Kavith-with-Gold-Bonam1

హైదరాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల సంబురాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.  ఆదివారం ఉదయం ఆదయ్యనగర్ కమాన్ నుంచి నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత బంగారు బోనం ఎత్తుకొని మహంకాళి ఆలయానికి బయలుదేరారు.   బంగారు బోనంతో పాటు 1016 బోనాలతో అమ్మవారి ఆలయం వరకు భారీఎత్తున జరిగే ఊరేగింపు కార్యక్రమాన్ని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, మంత్రి తలరసాని శ్రీనివాస్ యాదవ్  ప్రారంభించారు. బంగారు బోనం ఊరేగింపు ఆదయ్యనగర్ నుంచి ప్రారంభమై సిటీలైట్‌హోటల్, ఆర్మీరోడ్డు, సుభాష్‌రోడ్డు మీదుగా మహంకాళి గుడికి చేరుకుంటుంది. ఈ వేడుకకు భక్తులు భారీ ఎత్తున తరలివస్తున్నారు. అమ్మవారికి సమర్పించేందుకు 3 కిలోల 80గ్రాముల బంగారంతో బోనంను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా తయారు చేయించిన విషయం తెలిసిందే.