Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

ప్రతి పిహెచ్‌సికి వైద్యాధికారి

mp kavitha said every phc to medical officer

మన తెలంగాణ / నిజామాబాద్: జిల్లాలో ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వైద్యాధికారి ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత అధికారులకు ఆదేశించారు. జిల్లా కలెక్టర్ చాంబర్‌లో కలెక్టర్, జిల్లా వైద్యాధికారులతో బుధవారం వైద్యశా ఖ పనితీరును సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ… జిల్లాలో అవసరమైన చోట స్పెషలిస్టు డాక్టరును నియమాకం చేయాలని, ప్రసవాల శాతాన్ని పెంచాలని, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో గైనాకాలిజిస్ట్, అవాస్త లీస్ట్, అవుట్ సోర్సింగ్ ద్వారా గాని కాంట్రాక్టు పద్ధ్దతిలో నియమించాలని అందుకు అవసరమైన ప్రభుత్వ అనుమతుల మంజూరుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. జి ల్లాలో రేడియాలజిస్టుల పోస్టులు కూడా లేవని, కొందరు ఎంపిపిలు, జడ్పిటిసిలు విన్నవిస్తున్నందున కాంట్రాక్టు పద్ధ్దతికి నియామకం లేని పక్షంలో కేసుల చికిత్స ప్రకారంగా ప్రభుత్వం నిర్ధేశించిన విధంగా రుసుం చేల్లించి అవసరమైన సందర్భల్లో వారిని ఉపయోగించుకోనే ప్రజలకు ఇబ్బంది కలుగకుండా చూడాలని అన్నారు. 13వ ఆర్థిక సంఘం ద్వారా జిల్లాలో నిర్మించిన జివో ఏర్గట్ల, గోవింద్‌పేట్ ఇతర పథకాలలో మరో మూడు ఆరోగ్య కేం ద్రాల భనవాలను నిర్మించి ఉన్నందున ఆ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించెందుకు వైద్య అధికారిని డిప్యూటేషన్‌పై పంపించైనా వైద్య సేవలు అందించెందుకు కృషి చేయాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో అధికారులు సకాలంలో విధులకు హాజరవ్వడం లే దని ఆరోపణలు వస్తునందున వైద్య అధికారులు, సిబ్బంది సకాలంలో హాజరయేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పా రు. ప్రస్తుత పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం వైద్యంపై ప్రజలు ఆశలు పెంచుకుని ఓపి రేటు విపరీతంగా పెరుగుతున్నందున వారి ఆశలను వమ్ము చేయకుండా ప్రభుత్వ వైద్యు లు సకాలంలో విధులకు హాజరయ్యేందుకు కృషి చేయాలన్నారు. బీంగల్ ఆరోగ్య కేంద్రంలో మహిళా డాక్టరును నియమించేందుకు చర్యలు తీసుకోవాలని, అ క్కడ మహిళలు చికిత్స వచ్చే సందర్భంలో వారి బాధలను చె ప్పుకోనేందుకు మహిళా వైద్యురాలు ఉంటే మంచి చికిత్స అందించే అవకాశం ఉంటుందని సూచించారు.

మోర్తాడ్ మం డలంలోని పోస్టుమార్టం ఏర్పాటుకు అనుకూలంగా ఉన్న పక్షంలో త్వరలో ఏర్పాటు చేయాలని చె ప్పారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో వంద మంది ఔట్ సర్జన్స్ చేస్తున్నందున వారి సేవలు కూడా వినియోగించుకోవాలని, అవసరమైతే జిల్లా కలెక్టర్, సూపరిండెంట్ ప్రిన్స్‌పాల్ తగు నిర్ణయం తీసుకోని కమ్యూనిటీ హెల్త్ సేంటర్లు సేవలందించే విధంగా కృషి చేయాలన్నారు. జిల్లా పరిపాలన అధికారి ఎం. రామ్మోహన్‌రావు ఈ సంద్భరంగా ఆ యన మా ట్లాడుతూ… జిల్లాలో వైద్య అధికారుల పోస్టులు 9 ఖాళీగా ఉన్నాయని వాటిని ప్రభుత్వం నిర్దేశించిన విధంగా త్వ రలో నియమించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నా రు. జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు నమ్మకం పెరిగినందున 13 ఆర్థిక సంఘం ద్వారా నిర్మించిన ఇతర పథకాల ద్వారా నిర్మించిన భవనాలు ఖాళీగా నిరుపయోగంగా ఉన్నందున, కొత్తగా నియమించే వైద్య అధికారుల ను అక్కడ సేవలు అందించేందుకు కృషి చేస్తామన్నారు. ప్రతి నెల 2250 ప్రసవాలు కేసులు నమోదు అవుతున్నాయని, జిల్లా ఆసుపత్రికే ఎక్కువగా కేసులు రాకుండా బా ల్కొండ, మోర్తాడ్, డిచ్‌పల్లి, నవీపేట్, వర్ని, కమ్యూనిటి ఆసుపత్రులను అభివృద్ధ్ది చేసి ప్రసవావలను నిర్వహించడం జరుగుతుందన్నారు.
డాక్టర్ వెంకట్ జిల్లా వైద్యాధికారి
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. జిల్లాలో నియమించే వైద్యాధికారుల 9 పోస్టులలో మహిళా వైద్య అధికారికే ఉన్న పక్షంలో మొదటి ప్రాధాన్యత క్రింద బీంగల్ ప్రా థమిక ఆరోగ్య కేంద్రానికి నియమిస్తామని ఆరోగ్య వైద్య అధికారికి సబ్ సెంటర్లకు పరిశీలనకు వెళ్లేందుకు అప్పుడప్పుడు పర్యటిస్తారని ఆ సందర్భంలో పి.హెచ్.సి లలో విధులు నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, జాయింట్ కలెక్టర్ రవింధర్ రెడ్డి, అన్ని మండలాల ఎంపిడిఓలు, జడ్పిటిసిలు, తదితరులు పాల్గొన్నారు.

Comments

comments