Search
Sunday 23 September 2018
  • :
  • :

కార్యకర్తలే పార్టీకి పెద్ద దిక్కు

MP Kavitha Speech About Party Activists in Nizamabad

మన తెలంగాణ/నిజామాబాద్ ప్రతినిధి: దేశానికే నేడు తెలంగాణ దిక్సూచీగా నిలిచిందని, రాబోయే రోజుల్లో దేశంలో కీలక పదవిలో రాణించే అవకాశం టీఆర్‌ఎస్ పార్టీకి దక్కనుందని, పార్టీని ముందుకు తీసుకుపోతున్న కార్యకర్తలే పార్టీకి పెద్ద దిక్కుగా సీఎం కేసీఆర్ బావిస్తున్నారని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆకాంక్షించారు. ఆదివారం బోధన్‌లో జరిగిన బూత్ లెవల్ సమావేశంలో కార్యకర్తలనుద్ధేశించి ఆమె ప్రసంగించారు. పార్టీకి కష్టపడి పని చేసే వారిని తప్పకుండా ఆదిష్టాణం గుర్తిస్తుందని, వారి కోసం సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్దను కనబరుస్తారని చెప్పా రు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాక ప్రజలకిచ్చిన హామీలను అమలు చేసి మాట నిలబెట్టుకోవడంలో టీఆర్‌ఎస్ పార్టీ కార్యదీక్షతతో ముందుకు పో యిందన్నారు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల వారి సంక్షేమం కోసం కృషి చేశామని తెలిపారు.

దేశం మొత్తం నేడు సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని హర్షిస్తోందని, తెలంగాణలో జరుగుతున్న సంక్షేమం, ప్రగతిని చూసి హర్షిస్తోందని చెప్పారు. పార్టీలో పని చేస్తున్న కొందరిలో అసంతృప్తి చోటచేసుకుంటున్నప్పటికీ వారికి అన్ని విధాలుగా నచ్చజెప్పుతూ ముందుకు పోతున్నామన్నారు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు. రైతులను రారాజులను చేయాలన్న సంకల్పంతో వారికి సీఎం రైతు బంధు పథకంతో పాటు భీమాతో  ధీమాను కల్గిస్తున్నారని చెప్పారు. లోగడ పాలనలో ఉన్న పాలకులు ప్రజల కోసం, రైతుల బాగు కోసం ఒరగబెట్టిందేమీ లేదని విమర్శించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, ప్రగతిని ప్రజలు గుర్తిస్తున్నారని, రాబోయే రోజుల్లో కూడా కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, ఈ విషయాన్ని గుర్తించి కార్యకర్తలు పార్టీ సూచనలకు కట్టుబడి, కష్టించి పని చేయాలని పిలుపు నిచ్చారు. ప్రతి పక్షాల విమర్శలను తిప్పి కొడుతూ ప్రజల్లో మమేకం కావాలని సూచించారు. ఆమె వెంట బోధన్ ఎమ్మెల్యే షకీల్, టీఆర్‌ఎస్ నాయకులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఉన్నారు

Comments

comments