Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

అన్నార్థులకు ఆపన్నహస్తం

MP Kavitha Start  Free Meal Program in Nizamabad

మన తెలంగాణ/నిజామాబాద్ ప్రతినిధి: రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ తనయురాలు నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత దాతృత్వ హృదయాన్ని చాటుకుంటున్నారు. మానవత్వానికి బాష్యం చెప్పే రీతిలో అన్నార్థులకు అపన్న హస్తం అందిస్తూ వారి ఆకలిని తీరుస్తున్నారు. రాజకీయాలకు సంబంధం లేకుండా తన సొంత ఖర్చుతో ఈ ఉచిత భోజన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఆదరా బాదరగా వైద్య సేవల కోసం వచ్చే రోగుల సంబంధికులకు ఇంతకాలం భోజనం లభించడం కష్ట సాధ్యంగా ఉండేది. ఈ విషయాన్ని గుర్తించిన ఎంపి కవిత వెంటనే రోగుల బంధువులకు కూడా ఉచితంగా భోజన సేవలు అందించాలన్న నిర్ణయానికి వచ్చారు. ఆలోచనను అమలులో పెట్టి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో రోగుల బంధువులకు కూడా నాణ్యమైన రుచికర భోజనాన్ని అందించే విధంగా ఏర్పాట్లు చేశారు. అలాగే ఆర్మూర్ ప్రభుత్వాసుపత్రిలో కూడా రోగులు, రోగుల సంబంధికులకు ఉచిత భోజన సేవలను విస్తరింపజేశారు. ఎంపి కవిత చూపెడుతున్న ఆదరాభిమానాలు, సేవా ధృక్పధ భావాన్ని సొంత పార్టీ వారే కాకుండా అన్ని పార్టీల నాయకులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు ప్రశంసిస్తున్నారు. అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు, పర్యటనలతో నిత్యం బిజీగా ఉండే ఎంపి కవిత తీసుకున్న ఉచిత భోజన నిర్ణయాన్ని ప్రతిఒక్కరూ స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఆసుపత్రిలోనే కాకుండా గ్రంధాలయానికి వచ్చే పాఠకులకు కూడా ఉచిత భోజన సేవలు అందించే విధంగా కృషి చేయాలంటూ వినతులు వచ్చిన నేపథ్యంలో వారికి కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా ఉచిత మధ్యాహ్న బోజనాన్ని ప్రారంభింపచేశారు. ఏలాంటి ప్రభుత్వ నిధులకు సంబంధం లేకుండా తన సొంత ఖర్చులతో ఉచిత మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. సొంత ఖర్చుతో నిత్యనదానానికి ప్రారంభించిన కవిత అన్ని వర్గాల నుండి ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. ప్రస్తుతం అందిస్తున్న నాణ్యతతో కూడిన ఉచిత మధ్యాహ్న భోజనాన్ని ఆరగించిన రోగుల బంధువుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఆసుపత్రిలో భోజన కార్యక్రమం అమలు పట్ల సోషల్ మీడియా ద్వారా ఎంపికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు వెల్లువలా వస్తున్నాయి. ఉచిత భోజన కార్యక్రమంతో పాటు నిరుద్యోగులకు కావాల్సిన కోచింగ్ సదుపాయాన్ని కల్పించేందుకు నగరంలో అన్ని విభాగాలకుచెందిన కోచింగ్ సెంటర్లను ఏర్పాటుచేసి ఉచితంగా వారికి కోచింగ్ అందేలా చర్యలు తీసుకుంటామని కవిత హామీ ఇచ్చారు. కోచింగ్‌సెంటర్లనుర్పాటుకు కృషి చేస్తామని చెప్పడంతో నిరుద్యోగుల్లో సంతోషం వెల్లివిరుస్తోంది.

Comments

comments