Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

దేశం గర్వించదగ్గ పథకం ‘రైతుబంధు’

MP Kavitha talks about Rythu Bandhu scheme in Jagtial District

జగిత్యాల: రైతుబంధు పథకంలో భాగంగా నిజామాబాద్ ఎంపి కవిత సోమవారం జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో రైతులకు పట్టా పాసుపుస్తకాలు, చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… దేశం గర్వించదగ్గ పథకం రైతుబంధు అని అన్నారు. రాష్ట్రంలో కెసిఆర్ ప్రవేశపెడుతున్న పథకాలను ఇతర రాష్ట్రాలకు చెందిన నేతలు తమ పార్టీ మేనిఫెస్టోలో పెడుతున్నారని కవిత పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో పథకాలు ప్రవేశ పెడుతున్నామని, అన్నదాతలను అన్ని విధాల ఆదుకునేందుకు టిఆర్‌ఎస్ సర్కార్ ఎప్పుడూ ముందుంటుందని చెప్పారు.

Comments

comments