Home మల్కాజ్‌గిరి (మేడ్చల్) పేదలను ఆదుకునేందుకు సిఎం చేస్తున్న కృషి అభినందనీయం

పేదలను ఆదుకునేందుకు సిఎం చేస్తున్న కృషి అభినందనీయం

MP Mallareddy Speech About CM KCR

మనతెలంగాణ/ మేడ్చల్ : ప్రభుత్వం నిరుపేదల కోసం ఎంతగానో పాటు పడుతుందని ఎంపి మల్లారెడ్డి అన్నారు. శనివారం తోటరవికు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును ఎంపి మల్లారెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పేదలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. కాగా తోట రవి గత మూడు నెలల క్రితం కిడ్నీ శస్త్ర చికిత్స చేయించుకొన్నాడు. ఆయనకు రూ. 34 వేల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో శేఖర్‌గౌడ్, నర్సింహారెడ్డి, మోహన్‌రెడ్డి, శైలేందర్ తదితరులు పాల్గొన్నారు.