Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

శ్రద్ధతో చదివితేనే ఉజ్వల భవిష్యత్తు

Mp Mallareddy Speech About Study With Students

మనతెలంగాణ/మేడ్చల్ : ప్రతి విద్యార్థి శ్రద్దతో చదివితేనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న విద్యార్థులు నూతన ఆలోచనలతో ముందుకు సాగాలని సీఎంఆర్ విద్యాసంస్థల అధినేత, మల్కాజిగిరి ఎంపి మల్లారెడ్డి అన్నారు. మండలంలోని కండ్లకోయ గ్రామ పరిధిలో గల సీఎంఆర్ ఐటి, సీఎంఆర్‌ఇసి, సీఎంఆర్‌టెక్నికల్ క్యాంపస్, సీఎంఆర్ ఫార్మసీ కళాశాలల గ్రాడ్యుయేషన్ డే ఆదివారం కళాశాల ఆవరణలోని ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తన జీవితంలో ఓ లక్షాన్ని పెట్టుకొని లక్ష సాధన దిశగా ముందుకు సాగాలని నాలుగు సంవత్సరాల ఇంజనీరింగ్ పూర్తి చేయగానే జీవితం అయిపోలేదని జీవితంలో ఇంకా సాధించాల్సింది ఎంతో ఉందని విద్యార్థులకు సూచించారు. నిమిషం కూడా వృధా చేయకుండా శ్రమించాలని యువత అనుకుంటే దేనినైనా సాధించవచ్చునని దేశంలోని యువత కోసం ప్రపంచం స్వాగతం పలుకుతుందని అన్నారు.  జేఎన్టీయుహెచ్ రెక్టార్ గోవర్థన్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థి దశలో తన డిగ్రీ పూర్తైన తర్వాతనే నిజమైన జీవితం ప్రారంభమవుతుందని అన్నారు. డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థికి సమాజంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతాయని వాటిని ఛేదించుకొని ముందుకు సాగితే అవకాశాలు స్వాగతం పలుకుతాయని అన్నారు. రానున్న 25 ఏళ్ల కాలంలో ఎదురయ్యే సమస్యలను కూడా అధిగమించే ఆవిష్కరణలు రావాలని అన్నారు. ఈ సందర్భంగా ఎంపి మల్లారెడ్డి, జేఎన్టీయుహెచ్ రెక్టార్ గోవర్ధన్‌రెడ్డిలు విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. సీఎంఆర్ విద్యాసంస్థల కార్యదర్శి సి.హెచ్.గోపాల్‌రెడ్డి, శ్రీశైలంరెడ్డి, భూపాల్‌రెడ్డి, ప్రిన్సిపాల్‌లు జంగారెడ్డి, నారాయణ, అబ్బుల్,  శ్రీనివాసులరెడ్డి, రాజిరెడ్డి, డైరెక్టర్ సత్యనారాయణ, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Comments

comments