Home Default రైతులకు జీవిత బీమా బాండ్ల పంపిణీ

రైతులకు జీవిత బీమా బాండ్ల పంపిణీ

MP Ponguleti Distribution the Farmers Life Insurance Bonds

ఖమ్మం అర్బన్ : వెలుగుమట్ల రెవెన్యూ పరిధిలోని గొల్లగూడలో ఆదివారం ఉదయం రైతు బీమా బాండ్లను ఎంపి సొంగులేటి శ్రీనివాసరెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌ఎ పువ్వాడ అజయ్, జిల్లా రైతు కో-ఆర్డినేటర్ నల్లమల్ల వెంకటేశ్వర్లు, మేయర్ పాపలాల్, డిప్యూటీ మేయర్ బత్తుల మురళీ, మాజీ మార్కెట్ చైర్మన్ కృష్ణ, కార్పొరేటర్స్ కూరకుల వలరాజు, చేతుల నాగేశ్వరరావు, కమర్తపు మురళి, పగడాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపి పొంగులేటి మాట్లాడారు. రైతుల సంక్షేమం కోసం సిఎం కెసిఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారని కొనియాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వినియోగించుకోవాలని ఆయన రైతులను కోరారు.