Home తాజా వార్తలు అది యోగి సొంత భావన: టిఆర్‌ఎస్

అది యోగి సొంత భావన: టిఆర్‌ఎస్

Great success of Telangana is MP Vinod

 

హైదరాబాద్:తెలంగాణలో బిజెపి అధికారంలోకి వస్తే కరీంనగర్ పేరును మారుస్తామంటూ ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేసిన ప్రకటనను తెలంగాణ రాష్ట్ర సమితి(టిఆర్‌ఎస్) ఎద్దేవా చేసింది. అసలు అది ఒక అంశమే కాదని టిఆర్‌ఎస్ తేల్చివేసింది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బుధవారం కరీంనగర్‌లో ఒక ఎన్నికల ప్రచార సభలో యోగి ప్రసంగిస్తూ, తెలంగాణలో బిజెపి అధికారంలోకి వస్తే కరీంనగర్ పేరును కరిపురంగా మార్చి మీ మనోభావాలను గౌరవిస్తాము, అని చెప్పారు.

దీనిపై కరీంనగర్ ఎంపి బి.వినోద్ కుమార్ స్పందిస్తూ.. కరీంనగర్‌లో అది ఒక చర్చనీయాంశమే కాదని చెప్పారు. అది ఆయన (యోగి) సొంత భావనలా ఉంది. కరీంనగర్‌లో ఎవరూ దాని గురించి ఆలోచించడం లేదు. పేరు మార్చాలని కూడా ఎవరూ అడగలేదు. మొట్టమొదటిసారి దాని గురించి(పేరు మార్పు) నేను కూడా వింటున్నాను, అని పిటిఐతో మాట్లాడుతూ వినోద్ కుమార్ వ్యాఖ్యానించారు.

 

MP Vinod kumar over Yogi comments on Karimnagar