Home సిద్దిపేట పనుల్లో వేగం పెంచండి

పనుల్లో వేగం పెంచండి

 MP Vinod Kumar Said SpeedUp Mini Tankbund Works

మన తెలంగాణ/హుస్నాబాద్ : మినీ ట్యాంక్ బండ్ ప నులను వేగవంతం చేయాలని అధికారులను ఎంపి వినో ద్ కుమార్ ఆదేశించారు. ఆదివారం పట్టణంలోని ఎల్ల మ్మ చెరువు, డబుల్ బెడ్ రూం నిర్మాణ పనులను పరిశీ లించుటకు వచ్చిన ఆయన అధికారులతో మాట్లాడుతూ మినీ ట్యాంక్ బండ్ పనులతో పాటు పట్టణంలో ని ర్మించే డబుల్ బెడ్ రూం ఇండ్లలో నాణ్యతా ప్రమాణాలు పాటిం చి వేగంగా పూర్తి చేయాలన్నారు. నిర్మాణ  దిశలో ఉన్న ఎమ్మెల్యే క్వార్టర్‌ను వెంటనే పూ ర్తి చేసి ప్రారంబోత్సవానికి సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ సందర్బం గా ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాగు, సాగు నీటికి టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. తాజాగా చెరువులు, కాలువ లు మరమ్మత్తులకు రాష్ట్ర ముఖ్యమంత్రి రూ.3 వేల కోట్లు కేటాయించార ని, రాష్ట్రంలో గొలుసుకట్ట చెరువులు అధికంగా ఉన్నాయని, మిషన్ కాక తీ య ద్వారా చెరువులకు అనుబంధంగా ఉన్న కాలువలను కూడా అభివృద్ధి చేస్తున్నామన్నారు. ప్రతి వర్షపు నీటి చుక్కను ఒడిసి పట్టాలన్నదే సిఎం కేసిఆర్ లక్షమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నాయని, దాని నిర్మాణం పూర్తయితే నియోజకవర్గంలో జలకళ సంతరించుకుంటోందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీష్ కుమార్, ఎంఎల్‌సి నారదాసు లక్ష్మణ్‌రావు, అధికారులు, నాయకులు ఉన్నారు.