Home తాజా వార్తలు నడిగడ్డను ధాన్యాగారం చేస్తా

నడిగడ్డను ధాన్యాగారం చేస్తా

Singireddy

మన తెలంగాణ/గద్వాల ప్రతినిధి: గద్వాల, అలంపూర్ నియోజకవర్గాలు వ్యవసాయపరంగా ఎంతో అభివృద్ధి చెందుతున్నాయని ఇంకా అభివృద్ధి చెందడానికి తన వంతు సహాయ సహాకారాలు అందిస్తానని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. శుక్రవారం గద్వాలలో నూతనంగా నిర్మించిన ఎంపిడిఒ కార్యాలయంను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నడిగడ్డ ప్రాంతాలైన అలంపూర్, గద్వాల ప్రాంతాలలో వ్యవసాయపరంగా ఎంతో అభివృద్ధి చెందుతున్నదని వైవిద్యమైన పంటలు సాగుచేస్తు రైతన్నలు ముందుకు పోతారని తెలిపారు. రైతులను ఆదుకునేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అనేక పథకాలు అమలు చేశారని ముఖ్యంగా సాగునీరు అందించేందుకు తుమ్మిళ్ల పథకంను రూ. 783 కోట్ల నిధులతో చేపట్టడం జరిగిందన్నారు. ఈ పథకం వల్ల 3 రిజర్వాయర్లు నింపి దాదాపు 80 వేల ఎకరాలు సాగునీరు అందించేందుకు యుద్ద ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఇంతే కాక గట్టు ఎత్తిపోతల పథకం ద్వారా దాదాపు 50వేల ఎకరాలకు సాగునీరు అందుతాయని దీంతో గట్టులో శాశ్వతంగా కరువు పారద్రోలి వలసలను నివారించవచ్చని సూచించారు. భూమిని బట్టి పంటలు పండే విదంగా రైతుకు లాభసాటిగా చేసేందుకు వ్యవసాయశాఖ కృషి చేస్తుందని తెలిపారు. గతంలో పాలించిన ప్రభుత్వాలు భవనాలను నాసిరకంగ నిర్మించారని దీంతో ప్రాథమిక పాఠశాలలు కొన్ని శిథిలావస్థకు చేరాయని అన్నారు.

అధికారులు, ప్రజాప్రతినిధులు పర్యవేక్షణ ఉంటే భవనాలు గానీ ప్రభుత్వ ఆస్తులు గానీ సంరక్షించబడతాయని నూతన పంచాయతీ రాజ్ చట్టంతో మార్పులు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడుకుంటే పదికాలాల పాటు సేవలందిస్తాయని ఈ భవనం ఇంత సుందరంగా నిర్మించారని ఈ భవనం పదేళ్లకైనా ఇలాగే ఉండేలా చూసుకునే బాద్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. రైతుబంధు రెండవ దశ కింద కొంత సాంకేతిక లోపాలున్నందున రైతుబందు డబ్బులు జమ కాలేదని త్వరలో రైతుల ఖాతాలో జమ అవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ శశాంక మాట్లాడుతూ జొగులాంబ గద్వాల జిల్లా వ్యవసాయ పరంగా ముందుకుపోతున్నదని ప్రభుత్వం సాగునీరు కల్పించి ఆదుకుంటున్నదని తెలిపారు. ఎంఎల్‌ఎ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ గతంలో మంత్రిగా కొనసాగిన జూపల్లి కృష్ణారావు సహాయ సహకారాలతో ఎంపిడిఒ భవన నిర్మాణం పూర్తి అయిందన్నారు. ఇంకా అభివృద్ధి పనులకు నిరంజన్ రెడ్డి సహాయసహాకారులు కావాలని ఆయన కొరారు. అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహాం మాట్లాడుతూ నడిగడ్డలో అలంపూర్ వెనుకబాటుకు గురైందని గత పాలకుల వల్ల ఏ అభివృద్ధి జరగలేదన్నారు. ప్రస్తు తం గద్వాల శరవేగంగా ముందుకుపోతున్నదని అలంపూర్‌ను కూడా అభివృద్ధి పర్చాలని మంత్రిని కొరారు. ఆర్డీఎస్ రైతులకు తుమ్మిళ్ల ఎత్తిపోతల పనులు పూర్తి చేసి 80 వేల ఎకరాలకు సాగునీరు అందించాలని ఆయన కొరారు.

MPDO Building Launched By Minister Singireddy in Gadwal