Home జాతీయ వార్తలు గాంధీ విగ్రహం వద్ద ఎంపిల ఆందోళన

గాంధీ విగ్రహం వద్ద ఎంపిల ఆందోళన

SG

ఢిల్లీ : పార్లమెంట్ ప్రాంగణంలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద వైసిపి, అన్నాడిఎంకె మినహా  కాంగ్రెస్ ఎంపిలతో పాటు ఇతర ప్రతిపక్ష ఎంపిలు గురువారం ఆందోళనకు దిగారు. బ్యాంకు కుంభకోణం, రైతు సమస్యలు, అవిశ్వాస తీర్మానం, ఎస్‌సి,ఎస్‌టి చట్టం, ఎయిర్ ఇండియాలో పెట్టుబడుల ఉపసంహరణ తదితర సమస్యలపై సభలో చర్చించాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో యుపిఎ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ , ఎంపిలు పాల్గొన్నారు.

MPs’ Concern at the Gandhi Statue at Parliament