Home కుమ్రం భీం ఆసిఫాబాద్ స్థానిక ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు

స్థానిక ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు

MPTC and ZPTC 1st phase polls
జిల్లా ఎస్పీ మల్లారెడ్డి

ఆసిఫాబాద్‌: ఎంపీటీసీ, జడ్పీటీసీ మొదటి విడత ఎన్నికల పోలింగ్ బందోబస్తుకై సిద్దమైన జిల్లా పోలీసులు ప్రత్యేక సాయుధబలగాలకు, పోలీసు సిబ్బందికి జిల్లా ఎస్పీ మల్లారెడ్డి శనివారం కాగజ్‌నగర్ పట్టణంలోని వినయ్ గార్డెన్‌లో సూచనలు ఇచ్చారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ అన్ని చర్లు తీసుకున్నదని, స్థానికంగా ఉండే పోలీసు బందోబస్తుతో పాటుగా జిల్లాలోని పోలింగ్ స్టేషన్‌ను అనుసంధానం చేస్తూ నిరంతరం స్ట్రైకింగ్ పోర్స్ బృందాలు పెట్రోలింగ్ నిర్వహిస్తుంటాయన్నారు. రానున్న 48 గంటల సమయంలో ప్రతి నిమిషాన్ని పోలీసు బృందాలు నిశితంగా పరిశీలిస్తాయని, అనుమానిత వ్యక్తులు కదలికలపై నిఘా బృందాలు ఇచ్చిన సమాచారం మేరకు కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

ఎన్నికల నిబందనల ఉల్లఘించడం, విధి నిర్వహణలో ఉండే పోలీసు విధులకు ఆటంకం కలిగించే వారిపై చట్టప్రకారం కేసులు నమోదు చేయాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు. ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సంబందిత అధికారులకు తెలియజేశారు. ప్రజలు తమ ఓటు హక్కును నిర్భయంగా, స్వేచ్చగా వినియోగించుకోవాలని, ఆయా గ్రామాల ప్రజలు పోలింగ్ సిబ్బందికి సహకరించాలని ఎస్పీ మల్లారెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రంమలో జిల్లా ఎస్పీ మల్లారెడ్డి , అడిషనల్ ఎస్పీ గోద్రు, కాగజ్‌నగర్ డీఎస్పీ సాంబయ్య, సీఐలు , ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

MPTC and ZPTC 1st phase polls from monday