Home తాజా వార్తలు హైడ్రామా… ఎంపిపి స్థానం టిఆర్ఎస్ వశం

హైడ్రామా… ఎంపిపి స్థానం టిఆర్ఎస్ వశం

ముందస్తుగానే ఎంపిటిసి మౌనికను తప్పించారు
నా భార్యను కిడ్నాప్ చేశారంటు ఎంపిటిసి రజిత భర్త పోలీసులకు పిర్యాదు
నన్నెవరు కిడ్నప్ చేయలేదని ఎంపిటిసి రజిత పోలీసుల వాగ్మూలం ఇచ్చినట్లు సమాచారం
కాంగ్రెస్ నాయకులపై పెట్టిన కేసులు ఎత్తి వేసి, ఎంపిటిసి రజితను అప్పగించాలని పోలీస్ స్టేషన్ ఎదుట రస్తారోకో
రజితను తీసుకెల్లుతుంటె చెప్పుతో కొడుతున్న మహిళ

 

మన తెలంగాణ/నర్సంపేట: ఎట్టకేలకు హడ్రామా మధ్య నర్సంపేట ఎంపిపి స్థానాన్ని అధికార పార్టీ కైవసం చేసుకుంది. నర్సంపేట మండలంలో 11 ఎంపిటిసి స్థానాలు, అందులో కాంగ్రెస్ పార్టీ 6 ఎంపిటిసిలను కైవసం చేసుకోగా టిఆర్‌ఎస్ పార్టీ 5 ఎంపిటిసి స్థానాలను దక్కించుకుంది. ఈ నెల 4న ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికల పలితాలు వెల్లడి అయిన విషయం తెలిసిందే. డివిజన్‌లో 5 ఎంపిపి స్థాలకు అధికార పార్టీ కైవసం చేసుకోగా నర్సంపేట మండలంలో కాంగ్రెస్ పార్టీ 6 ఎంపిటిసిలను కైవసం చేసుకుంది. గెలిచిన ఎంపిటిసిలను నర్సంపేట కాంగ్రెప్ పార్టీ నాయకులు 7న జరిగె ఎంపిపి బల నిరూపణ కోసం గెలిచిన ఎంపిటిసిలను క్యాంపుకు తరలించారు. ఎట్టకేలకు నర్సంపేట ఎంపిపి స్థానం కైవసం చేసుకునేందుకు అధికార పార్టీ నేతలు తమదైన శైలిలో కాంగ్రెస్ ఎంపిటిసిల బంధువులకు ఎర వేసి, అనుకున్న లక్ష్యం సాదించుకున్నారు.

ముందస్తుగానే బానోజీపేట ఎంపిటిసి మౌనికను తప్పించారు……..

అనుకున్న లక్ష్యం చేజిక్కించుకునేందుకు అధికార పార్టీ నేతలు పథకం ప్రకారం మౌనికను ముందస్తుగానే తప్పించారు. అనారోగ్య సమస్య కారనంగా మౌనిక తండ్రి మోహన్ పోలీస్ కానిస్టేబుల్ మౌనికకు ఆరోగ్య బాగోలేదని మౌనికను క్యాంపునుండి ఇంటికి తీసుకువచ్చినట్లు సమాచారం వెంటనే కాంగ్రెస్ నాయుకులు మౌనిక భర్తను కలిసి మౌనిక దగ్గరికి వెళ్లినట్లు తెలిసింది, విషయం తెలుకున్న మౌనిక తండ్రి మోహన్ మౌనిక కోసం వెళ్లిన నాయకులను బెదిరించి వాపసు పంపంచినట్లు సమాచారం. మౌనిక తండ్రి మోహన్ ముందస్తుగానే అధికార పార్టీ నేతలతో మంతనాలు జరిపి నర్సంపేట ఎంపీపీ స్థానానికి సమాచారం అందించారు.
నా భార్యను కిడ్నాప్ చేశారంటు ఎంపిటిసి రజిత భర్త బిక్షపతి పోలీసులకు పిర్యాదు…..

లక్నెపల్లిలో ఎంపిటిసిగా గెలుపొందిన రజితను కిడ్నాప్ చేశారంటూ రజిత భర్త బిక్షపతి నర్సంపేట పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేశారు. వెంటనే స్సందించిన పోలీసులు రజిత కోసం నర్సంపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి ఎస్‌ఐ నాగ్‌నాద్ వెల్లగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రజిత ఉంది. వెంటనే ఎస్ఐ నాగ్‌నాథ్ నిన్ను కిడ్నాప్ చేశారని పిర్యాదు వచ్చిందంటూ రజితను పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. రజిత వెంట స్థానికంగా ఉన్నటువంటి కాంగెస్ నాయకులు పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. పోలీసులతో వాగ్వి వాదానికి దిగారు.
నన్ను కిడ్నాప్ చేయలేదు: ఎంపిటిసి రజిత

రజితను కిడ్నాప్ చేశారంటు నర్సంపేట పోలీస్ స్టేషన్‌కు తీసుకు వచ్చిన రజితను ెసిపి సునితా మోహనతో పాటు రూరల్ సిఐ సతీష్‌బాబు రజితను విచారించినట్లు తెలిసింది. రజిత నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదంటూ రజిత పోలీలకు తెలుపడంతో వెంటనే రజిత కిడ్నాప్ పై పెట్టిన కేసు ఉపసంహరణ చేసి రజితను వెంటనే తన భర్త బిక్షపతితో పంపిస్తునట్లు పోలీసులు తెలిపారు.

పోలీస్ స్టేషన్ ముందు కాంగ్రెస్ నాయకులు రస్తారోకో…….

కాంగ్రెస్ నాయకులపై పెట్టిన తప్పుడు కేసులు ఎత్తి వేయడంతో పాటు తమ అభ్యర్థి లక్నెపల్లి ఎంపిటిసి రజితను తమకు అప్పగించాలని కాంగ్రెస్ పార్టీ నేతలు పోలీస్ స్టేషన్ ముందకు రాస్తారోకో చేశారు. రాస్తారోకోతో ప్రదాన రహదారి కావడం వల్ల ఆర్‌టిసి బస్సులతో పాటు ప్రైవేటు వాహనాలు ఆగిపోయాయి వెంటనే ఎసిపి సునితా మోహన్ సిఐ సతీష్‌బాబు సిబ్బంది నాయకులకు నచ్చజెప్పి ఆందోళనను విరమించారు.

చెప్పుతో కొట్టిన మహిళ…..

ఎంపిటిసి రజితను పోలీసులు విచారించిన అనంతరం రజిత భర్త బిక్షపతితో రజితను పంపిస్తుండగా పోలీస్ స్టేషన్ బయట ఉన్నటువంటి అధికార పార్టీ నేతలు రజితను బలవంతంగా తీసుకెళ్లుతుంటే కాంగ్రెస్ పార్టీ నేతలకు అధికార పార్టీ నేతల మద్య వాగ్వివాదం, తోపులాట జరిగింది. ఒకరి ఒకరు తోపుకుంటు ఓ మహిళ రజితను తీసుకెళ్లదంటూ నాయకులను చెప్పుతో కొట్టినట్లు సమాచారం.

 

MPTC Elections: TRS Party Got Narsampet MPP in Warangal