Search
Friday 16 November 2018
  • :
  • :

సర్వసభ్య సమావేశంలో సభ్యుల ఆగ్రహం

MGNREGA

సారంగాపూర్ : మండల పరిషత్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన ఎంపిపి కొల్ముల శారద అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో సంవత్సరాల తరబడి ఉపాధి హామీ కూలీ డబ్బులు చెల్లించకపోవడంతో సభ్యులు ముక్తకంఠంగా కూలీ డబ్బులు చెల్లించా లని నిరసించ డంతో మండల సర్వసభ్య సమావేశం ఉపాధి రగడగా కొనసాగింది. మండల సర్వసభ్య సమావేశానికి ముఖ్యఅతిథిగా జెడ్పీటీసీ సభ్యురాలు భూక్య సరళ హాజరయ్యారు. ముందుగా వ్యవసా య శాఖపై సమీక్ష నిర్వహించగా రైతులకు కావా ల్సిన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉన్నా యని ఎఓ తిరుపతి నాయక్ తెలిపారు. అనంతరం మహత్మగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంపై సమీక్ష నిర్వహించగా సభ్యులు కూలీలకు కూలీ డబ్బులు చెల్లించడం లేదని, గత కొన్ని సంవత్స రాలుగా కూలీల విషయంలో ఉపాధి హామీ సిబ్బంది పూర్తిగా నిర్లక్షం వహిస్తున్నారు. గతంలో చేపట్టిన సామాజిక తనిఖీ సమావేశాన్ని బహిష్క రించామని అయినా అధికారుల్లో మార్పు రావడం లేదన్నారు. ఉపాధి హామీ పనికి వచ్చే వారంతా నిరుపేదలేనని వారికి సకాలంలో కూలీలు అందించేలా చర్యలు చేపట్టారు. దీనిపై స్పందించిన ఎపిఎం శ్రీనివాస్ మాట్లాడుతూ గతంలో బ్యాం కుల్లో జరిగిన పొరపాట్ల వల్లనే కూలీల డబ్బులు అందడం లేదని ప్రస్తుతం వేరే బ్యాంక్‌ల ద్వారా లావాదేవీలు జరుగుతున్నాయని ఇక ముందు అలాంటి పొరపాట్లు జరగవన్నారు. ఈ కార్యక్రమం లో తహసీల్ధార్లు హన్మంతరెడ్డి, వెంకటరమణ, ఎంపి డిఒ పుల్లయ్య, ఎస్‌ఐలు రణధీర్, ఆరోగ్యం, వివిధ శాఖల అధికారులు ఆయా గ్రామాల ప్రజాప్రతిని ధులు పాల్గొన్నారు.

Comments

comments