Search
Tuesday 20 November 2018
  • :
  • :

భూపాలపల్లిలో టిఆర్ఎస్ కు ఝలక్

MPTC

భూపాలపల్లి జిల్లా మంగంపేట మండలంలో టిఆర్ ఎస్ పార్టీకి తొమ్మిది మంది ఎంపిటిసిలు రాజీనామా చేశారు. టిఆర్ ఎస్ పార్టీ సభ్యత్వానికి, తమ పదవులకు సైతం చేసిన రాజీనామా లేఖలను ఎంపిడిఒ ఆఫీస్ లో చూపెడుతూ.. మీడియాతో మాట్లాడారు. ప్రజల వేసిన ఓట్లతో గెలిచి ప్రజలకు సేవ చేయలేకపోతున్నామని, నాలుగు సంవత్సరాల నుంచి ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. టిఆర్ ఎస్ ప్రభుత్వం తమని పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.    గ్రామాలలో అభివృద్ధి పనులు చేయలేక ప్రజలకు తమ ముఖం చూపించలేకపోతున్నామని వాపోయారు. తమ రాజీనామా లేఖలను మండల అధ్యక్షుడికి, నియోజకవర్గ ఇంఛార్జ్ కు, రాష్ట్రం అధ్యక్షుడికి పంపిస్తామని  చెప్పారు.

Comments

comments