Home తాజా వార్తలు ‘మిస్టర్ మజ్ను’ ట్రైలర్: స్టాండర్డ్స్ అందుకోవడం ఖాయం

‘మిస్టర్ మజ్ను’ ట్రైలర్: స్టాండర్డ్స్ అందుకోవడం ఖాయం

Mr Majnu Theatrical Trailerఅక్కినేని అఖిల్ తాజా చిత్రం ‘మిస్ట‌ర్ మ‌జ్ను’.  తాజాగా మూవీ ప్రీ రిలీజ్ వేడుక సందర్భంగా సినిమా ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. వరుణ్ తేజ్ తో ‘తొలిప్రేమ’ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెర‌కెక్కించిన యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా, వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.  టీజర్, ఆడియోతో ఆకట్టుకున్న ‘మిస్ట‌ర్ మ‌జ్ను’ తాజాగా రిలీజైన ట్రైలర్ తో సినిమాపై అంచనాలు తారస్థాయికి చేరాయి. ట్రైలర్ చూస్తుంటే కంప్లీట్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీతో అఖిల్ విజయాన్ని అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ‘నా కోసం ఎవరైనా ఏడిస్తే అది నా తప్పు కాదు కానీ, నా వల్ల ఒక్కళ్ళు ఏడ్చినా అది ఖచ్చితంగా నా తప్పే అవుతుంది’ అంటూ అఖిల్ చెప్పిన డైలాగ్ చాలా నేచురల్‌గా ఉంది. ఈ చిత్రంలో క‌థానాయిక‌గా నిధి అగ‌ర్వాల్ న‌టిస్తుంంది. అఖిల్, నిధిల మధ్య ప్రేమ సన్నివేశాలను చాలా కొత్తగా తెరకెక్కించాడు దర్శకుడు. ఇతర ముఖ్యపాత్రల్లో నాగబాబు, ప్రియదర్శి, జయప్రకాష్, హైపర్ ఆది నటిస్తున్నారు. యంగ్ తరంగ్ ఎస్ఎస్ థ‌మ‌న్ స్వరాలు అందిస్తున్నారు. జనవరి 25న మూవీ విడుదల కానుంది.

Mr Majnu Theatrical Trailer is Released