Search
Friday 21 September 2018
  • :
  • :

తెలంగాణ సర్కార్‌పై మందకృష్ణ మండిపాటు

manda-krishna-madiga

హైదరాబాద్ : తెలంగాణ సర్కార్‌పై ఎంఆర్‌పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. బుధవారం ఆయన సికింద్రబాద్ కోర్టుకు హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఆయన ధ్వజమెత్తారు. గవర్నర్ నరసింహన్‌ను కలిసి సిఎం కెసిఆర్ వైఖరిపై ఫిర్యాదు చేస్తామని ఆయన చెప్పారు. గవర్నర్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని అన్నారు. సినీ గ్లామర్‌ను అడ్డుపెట్టుకుని తిరుగుతున్న పవన్‌కల్యాణ్‌కు ఓట్లు పడవని ఆయన పేర్కొన్నారు. డిమాండ్ల సాధనలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమను అణిచి వేస్తున్న తెలంగాణ సర్కార్ పవన్ విషయంలో మాత్రం ఉదాసీనతగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు.

MRPS Chief Manda Krishna Comments on TS Govt

Comments

comments